భారత ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంచలన నిర్ణయాలతో దేశంతో పాటు ప్రపంచ ప్రజల అభిమానాలను చొరగొంటున్నారు నరేంద్ర మోడీ.ఈ మధ్యకాలంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు సైతం ప్రపంచంలోనే ప్రభావవంతమైన, శక్తివంతమైన నేతల్లో మోడీ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఆయనకు మనదేశంతో పాటు పలు దేశాల వారు అభిమానులుగా మారిపోయారు.ఈ లిస్ట్‌లో పిల్లలు కూడా వున్నారు.
తాజాగా దుబాయ్‌లో స్థిరపడిన ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలుడు భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీకి బహుమతి పంపాడు.కేరళకు చెందిన సరన్ శశికుమార్ అనే బాలుడు స్వయంగా మోడీ చిత్రపటాన్ని గీసి… ఇటీవల యూఏఈ పర్యటనకు వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌కు అందజేశాడు.ఇక పెయింటింగ్‌లో ప్రధాని మోడీ సీఐఎస్ఎఫ్ లోగో వున్న టోపీ పెట్టుకుని సెల్యూట్ చేస్తున్నట్లు ఉన్నారు.దాదాపు 6 గంటల పాటు కష్టపడి ఆరు రంగుల లేయర్లతో పెయింటింగ్ వేసినట్లు సరన్ వెల్లడించాడు.
దుబాయిలోని న్యూ ఇండియన్ మోడల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ బాలుడికి మోడీ అంటే ఎంతో ఇష్టం.గతంలో కూడా ప్రధాని చిత్రపటాన్ని గీసి బహుమతిగా పంపించాడు.
అలాగే దుబాయి రాజుల పెయింటింగ్స్ సైతం గీసి.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసలు అందుకున్నాడు.
ఈ బహుమతిని అందుకోవడంపై కేంద్ర మంత్రి మురళీధరన్ స్పందించారు.అద్భుతమైన ప్రతిభవున్న చిన్నారిని కలవడం సంతోషంగా వుందని ట్వీట్ చేశారు. ఆరు లేయర్లతో గీసిన మోడీ పెయింటింగ్ అద్భుతంగా వుందని… ఆ బాలుడికి అభినందనలు తెలియజేశారు.మరోవైపు ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగే పరేడ్‌లో భారత్ తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలను ప్రదర్శించనుంది.
భారతదేశ సైనిక శక్తి, సాయుధ దళాల్లోని అత్యాధునిక ఆయుధాలైన మూడు టీ-90 ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, బీఎంపీ-2, రెండు పినాకా మల్టి రాకెట్ లాంచ్ సిస్టమ్, రెండు బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు సంవిజయ్, అప్ గ్రేడెడ్ షిల్కా ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థలను ప్రదర్శించనున్నారు.