కాళ్లకు చెప్పులు లేని దుస్థితి.. గెట్ లాస్ట్ అన్న చోటే ఛైర్మన్.. ఇస్రో శివన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒకప్పుడు కాళ్లకు చెప్పులు కూడా లేని దుస్థితిని ఎదుర్కొని కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువు కాదు.అయితే ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ శివన్( ISRO chief Dr Sivan ) మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా చదువును నిర్లక్ష్యం చేయకుండా దేశం గర్వించే స్థాయికి ఎదిగారు.

 Doctor K Sivan Nadar Inspirational Success Story Details Here Goes Viral In Soci-TeluguStop.com

డాక్టర్ కె శివన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉన్న సాధారణ రైతు కుటుంబంలో శివన్ జన్మించారు.

ప్యాంటు, షర్ట్ లేక శివన్ ధోవతి ధరించిన రోజులు సైతం ఉన్నాయి.స్కాలర్ షిప్ లతో విద్యాభ్యాసం పూర్తి చేసిన శివన్ ఐఐటీ బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పీహెచ్డీ ( PhD in Aerospace Engineer from IIT Bombay )చేశారు.

చదువు పూర్తైన తర్వాత శివన్ టీచర్ కావాలని అనుకున్నారు.జాబ్ కోసం శివన్ ఇస్రో కేంద్రానికి వెళ్లగా అక్కడ యూజ్ లెస్ ఫెలో నీకు ఉద్యోగం రాదు గెట్ లాస్ట్ అంటూ శివన్ ను అవమానించారు.

అయితే ఎక్కడ అవమానాలు ఎదురయ్యాయో శివన్ అక్కడే ఛైర్మన్ అయ్యారు.

Telugu Sivan Nadar, Isrochairman, Isro Dr Sivan, Phdaerospace, Story, Tamil Nadu

నాలుగుసార్లు ఫెయిలైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా శివన్ బాధ్యతలు తీసుకున్న సమయంలో శివన్ ను స్నేహితులు విమర్శించారు.ఆ ప్రాజెక్ట్ ను సక్సెస్ చేసిన శివన్ ఆ తర్వాత ఇస్రో ఛైర్మన్ అయ్యారు.చంద్రయాన్2 ల్యాండర్ విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయిన సమయంలో పసిబిడ్డలా శివన్ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ మధ్య కాలంలో ఇస్రో సాధించిన ఘన విజయాల వెనుక శివన్ కృషి ఎంతో ఉంది.

Telugu Sivan Nadar, Isrochairman, Isro Dr Sivan, Phdaerospace, Story, Tamil Nadu

శివన్ డిజైన్ చేసిన సితార అనే సాఫ్ట్ వేర్ సహకారం వల్ల ఇస్రో రాకెట్లను కక్ష్యలోకి పంపుతోంది.ఎన్నో ప్రాజెక్ట్ లకు శివన్ వెన్నెముకగా నిలిచారు.దేశ ప్రజలు ఇచ్చే మద్దతు నాకు కొండంత బలం అని శివన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

శివన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube