భారత్, బ్రెజిల్‌లతో వాణిజ్య నిబంధనలు కఠినతరం.. ట్రంప్ ప్రచార బృందం అజెండా

2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారం అమెరికాలో ఊపందుకుంది.రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజల ముందు పెడుతున్నారు.

 Donald Trump's Bid For White House: Tightening Trade Plans With India Brazil ,-TeluguStop.com

కోర్టు కేసులు, న్యాయపరమైన అభియోగాలతో ఇబ్బందపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) సైతం రంగంలోకి దిగారు.తాను మరోసారి అధ్యక్షుడినైతే కఠినమైన వాణిజ్య విధానాలు అవలంభిస్తామని సంకేతాలు ఇవ్వడంతో అమెరికన్ వ్యాపార సంఘంలో ఆందోళన మొదలైంది.

Telugu Brazil, Donald Trump, India, Joe Biden, John Morphy, Jersey, Republican-T

న్యూజెర్సీ( New Jersey )లోని బెడ్‌మిన్‌స్టర్‌లో ఫోన్ కాల్స్, విందుల ద్వారా పన్ను కోతలను పొడిగించడం, బైడెన్( Joe Biden ) విధించిన నిబంధనలను ఉపసంహరించుకోవడం వంటి తన ఆర్ధిక ప్రణాళికలను వివరించాలని ట్రంప్ భావిస్తున్నారు.భారత్, బ్రెజిల్‌లలో అమెరికన్ వస్తువులపై అధిక పన్నులు వుంటే.ఆ దేశంతో సమానంగా ట్రంప్ కఠినమైన లెవీని విధిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ట్రంప్ ఫస్ట్ టర్మ్ అధ్యక్షుడిగా అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సుంకాలపై టిట్ ఫర్ టాట్ అన్న విధంగా ట్రంప్ వ్యవహారశైలి వుంటుందన్న సంగతి తెలిసిందే.

Telugu Brazil, Donald Trump, India, Joe Biden, John Morphy, Jersey, Republican-T

అయితే సుంకాలను పెంచడం వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇది అమెరికాలో తయారీని దెబ్బ తీస్తుందని.తద్వారా ఇతర దేశాలు కూడా తమ టారీఫ్‌లను పెంచడానికి కారణమవుతుందని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో అంతర్జాతీయ వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ మార్ఫీ పేర్కొన్నారు.

ప్రస్తుతం అమెరికా ఎగుమతులు 3 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో వున్నాయని ఆయన చెప్పారు.ముఖ్యంగా USలోకి ప్రవేశించే వస్తువులు, సేవలపై ప్రతి మలుపులోనూ చర్చలు జరపాలన్న ట్రంప్ కోరికకు ఇది కొనసాగింపు అని విశ్లేషకులు అంటున్నారు.

కొద్దిరోజుల క్రితం ట్రంప్ మాట్లాడుతూ.మరోసారి తాను అధ్యక్షుడినైతే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్‌లో అమెరికా ఉత్పత్తులపై అత్యధిక పన్నులు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇండియాలో 100 శాతం, 150 శాతం, 200 శాతం పన్నులు వున్నాయని.పరిస్ధితులు ఇలాగే కొనసాగితే అమెరికన్ కంపెనీలు భారత్‌లో వ్యాపారం ఎలా చేస్తాయని ట్రంప్ ప్రశ్నించారు.2024లో రిపబ్లికన్ పార్టీ( Republican Party )ని గెలిపిస్తే.భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్నులు విధిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube