అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికాలో( America ) రాజకీయాలు వేడెక్కాయి.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు 2024 అధ్యక్ష బరిలో నిలిచారు.
వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు( Democratic , Republican parties ) చెందిన పలువురు నేతలు కూడా రేసులో నిలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఇక అధ్యక్షుడు జో బైడెన్ విషయానికి వస్తే.
ఇప్పుడిప్పుడే ఆయన పాలనపై పట్టుబిగిస్తున్నారు.ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగం, బ్యాంకుల దివాళా , ద్రవ్యోల్బణం వంటి అంశాలు బైడెన్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఇటీవల అమెరికా రుణ పరిమితి అంశం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.అయితే బైడెన్ తన మంత్రాంగంతో రిపబ్లికన్‌లను దారికి తెచ్చుకుని కాంగ్రెస్‌లో రుణ పరిమితి పెంపుకు అడ్డంకులను క్లియర్ చేసుకున్నారు.
అయితే రానున్న కాలంలో కుమారుడు హంటర్ కారణంగా జో బైడెన్ ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఏకంగా అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్‌హౌస్‌లో కొకైన్( Cocaine ) బయటపడింది.తెల్లని రంగులో వున్న ఓ పదార్ధాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆదివారం గుర్తించారు.దీనిని వారు కొకైన్‌గా గుర్తించారు.అయితే దీనిపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు మరిన్ని పరీక్షలు చేయనున్నారు.అయితే చీమ చిటుక్కుమన్నా పసిగట్టగలిగే స్థాయిలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు వుండే వైట్‌హౌస్‌లోకి కొకైన్ ఎలా వచ్చిందన్నది మాత్రం అంతు చిక్కకుండా వుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన కుమారుడు హంటర్ బైడెన్‌లపై విరుచుకుపడ్డారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ).వైట్‌హౌస్ వెస్ట్ వింగ్‌లో ఓవల్ ఆఫీసుకు అతి సమీపంలో దొరికిన కొకైన్ .జో బైడెన్, హంటర్‌లకు కాకుండా ఇతరులకు ఉపయోగపడుతుందని ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.ఈ మేరకు తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
అంతేకాదు.సీక్రెట్ సర్వీసులకు చాలా చిన్న మొత్తంలోనే కొకైన్ దొరికిందని అంటున్నారని ట్రంప్ మండిపడ్డారు.
ఈ ఘటన జరిగినప్పుడు అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో లేరు.ఆయన క్యాంప్ డేవిడ్‌లో వీకెండ్‌ను గడిపేందుకు వెళ్లారు.అయితే కొకైన్ దొరకడంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్( Karin Jin Pear ) మీడియాతో మాట్లాడుతూ.వైట్‌హౌస్ వెస్ట్ వింగ్ ప్రాంతానికి ఎక్కువమంది సందర్శకులు వస్తారని తెలిపారు.
దీనిని బట్టి తాను చెప్పేది ఇంకేం లేదని కరీన్ అన్నారు.ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.