అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చైనా చేతిలో అమెరికా కీలుబొమ్మగా మారుతుందని.
అమెరికా ప్రజలు అందరూ ఒకే తాటిపై నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి బరిలో నిలిచిన బిడెన్ గనుకా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా చైనా పాలనలోకి వెళ్తుందని అన్నారు.
ఉత్తర అమెరికా స్వేచ్చా ఒప్పందంతో పాటు ,ప్రపంచ వాణిజ్య సంస్థ , ప్రపంచ వ్యాణిజ్య సంస్థ లోకి చైనా ప్రవేశానికి డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇచ్చిందని, బిడెన్ అందుకు మద్దతు ఇవ్వడం అమెరికా చరిత్రలో ఘోరమైన తప్పిదాలని ట్రంప్ ప్రకటించారు.
మేము ప్రపంచ వాణిజ్య సంస్థని చూస్తున్నామని అన్నారు.మేము wto నిభంధనల ప్రకారం నడవడం లేదని చైనా పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బిడెన్ చైనా కి మద్దతుగా ఉన్నారని, ఒక వేళ బిడెన్ గెలిస్తే అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికాని చైనా సొంతం చేసుకుంటుందని, చైనా చేతిలో అమెరికా కీలు బొమ్మగా మారుతుందని అన్నారు.నేను చైనాపై ఆధారపడకుండా అమెరికాలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తుంటే బిడెన్ మాత్రం చైనా కి మద్దతు తెలుపడం అన్యాయమని అన్నారు.
త్వరలో తాము చైనాతో ఉన్న అన్ని సంభంధాలను విడదీయనున్నామని అమెరికా ఏ విషయంలో కూడా చైనాపై ఆధారపడకుండా చేస్తానని తెలిపారు.