బ్రిటన్ రాజుగా కింగ్ ఛార్లెస్ 3( King Charles 3 ) పట్టాభిషేకం శనివారం జరగనుంది.ప్రపంచాన్ని ప్రభావితం చేయగల దేశం కావడంతో పాటు ఎన్నో దేశాలను ఏళ్ల పాటు పాలించిన చరిత్ర వుండటంతో కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకానికి ప్రాధాన్యత వుంది.
ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు.ఇప్పటికే పట్టాభిషేకానికి రావాల్సిందిగా దేశాధినేతలకు , ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
అయితే ఇంతటి విశిష్ట కార్యక్రమానికి దూరంగా వుండాలని నిర్ణయించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) వైఖరిపై అక్కడి విపక్షాలు మండిపడుతున్నాయి.తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమన్నారు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్న ట్రంప్.శనివారం లండన్‌లో జరనున్న పట్టాభిషేకానికి బైడెన్ హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయాన్ని ‘అగౌరవపరచడమేనని’’ అభివర్ణించారు.దేశాధ్యక్షుడి హోదాలో పట్టాభిషేకానికి రాకుండా నిద్రపోతే.అంతకంటే చెడ్డ విషయం లేదని బ్రిటన్‌కు చెందిన జీబీ న్యూస్‌తో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు.తాను అధ్యక్షుడిగా వుండి వుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాడినని ఆయన పేర్కొన్నారు.ఖచ్చితంగా అమెరికా ప్రతినిధి ఒకరు ఇక్కడ వుండాలని.
అలాంటిది , పట్టాభిషేకానికి బైడెన్ రావడం లేదని తెలిసి తాను ఆశ్చర్యపోయానని ట్రంప్ వెల్లడించారు.అయితే బైడెన్‌కు బదులుగా ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ( Jill Biden )ఈ కార్యక్రామానికి హాజరవుతారని సమాచారం.
ఇదే సమయంలో గతంలో జరిగిన బ్రిటీష్ చక్రవర్తులు/రాణుల పట్టాభిషేక మహోత్సవాలకు ఏ అమెరికా అధ్యక్షుడూ హాజరుకాలేదని పలువురు అధికారులు గుర్తుచేస్తున్నారు.దీనికి అనుగుణంగానే బైడెన్ నిర్ణయం తీసుకుని వుండొచ్చని వారు వాదిస్తున్నారు.
ఇకపోతే.బ్రిటన్‌లో 1953లో చివరిసారిగా క్వీన్ ఎలిజబెత్ II( Queen Elizabeth II ) పట్టాభిషేకం జరిగింది.శనివారం జరిగే కింగ్ ఛార్లెస్ III పట్టాభిషేకానికి మొత్తం 2,200 మంది అతిథులు వస్తారని అంచనా.ఇంతటి చారిత్రక ఘట్టానికి పలువురు భారతీయులకు కూడా ఆహ్వానం అందింది.
సోమవారం సాయంత్రం ఆవిష్కరించిన అతిథుల జాబితాలో ఈ మేరకు భారతీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.రాజకుటుంబ సభ్యులు, కమ్యూనిటీ, ఛారిటీ ఛాంపియన్‌లతో పాటు 100 మంది దేశాధినేతలు సహా 203 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు రానున్నారని వెల్లడించింది.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డేర్ లేయెన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.