సాధారణంగా కొంతమంది పెంపుడు జంతువులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు.కొందరు కుక్కలను ఇష్టపడితే, మరికొందరు పిల్లలను ఇష్టపడుతుంటారు.
ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు వాటిని వెంట తీసుకెళ్లి, ఎంతో అపురూపంగా చూసుకుంటారు.ఇక కుక్కలు అయితే యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటాయి.
ఇలాంటి తరహాలోనే తన పెళ్లి హడావిడిలో తమ పెంపుడు కుక్కను పట్టించుకోలేదని, కోపంతో ఏకంగా పెళ్లి కూతుర్ని ఒక్క తన్ను తన్నిన ఘటన చైనాలో చోటు చేసుకుంది.
చైనాకు చెందిన 25 సంవత్సరాల కావో అనే మహిళ శాన్ జియు అనే కుక్క పిల్లను ఎంతో అపురూపంగా చూసుకునేది.
ఆ కుక్కపిల్ల కూడా తన యజమానురాలి పై ఎంతో విశ్వాసం ప్రదర్శించేది.అయితే కావో పెళ్లి నిశ్చయం కావడంతో తన పెళ్లి హడావిడిలో శాన్ జియు ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది.
తనను పట్టించుకోలేదనే కోపంతో శాన్ జియు తన యజమానురాలి కావో పెళ్లిలో ఏకంగా పెళ్లి కూతుర్ని ఒక్క తన్ను తన్నింది.ఈ సంఘటనను చూసిన పలువురు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
చైనాలో బోజౌలో జరిగిన పెళ్లి వేడుకలలో భాగంగా నూతన దంపతులు శాన్ జియును ఎత్తుకొని ఫోటోలకి ఫోజులు ఇవ్వగా శాన్ జియు పెళ్లి కూతుర్ని లాగి ఒక్క తన్ను తన్నింది.అయితే తనను దగ్గరకు తీసుకున్న పెళ్ళికొడుకుని మాత్రం ముద్దులతో ముంచెత్తింది.
అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లిలో ఈ కుక్క చేసిన పని ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.ఈ వీడియో చూసిన సదరు నెటిజన్లు పెంపుడు జంతువులకు కోపం వస్తే ఇలా రివెంజ్ తీర్చుకుంటాయా… అని కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోకి స్పందించిన కావో తన పెళ్లి హడావిడిలో పడి తనను పట్టించుకోవడం నిర్లక్ష్యం చేసేసరికి శాన్ జియు కోపంతో ఇలా చేసిందని, కానీ తన భర్తతో చాలా ఎంజాయ్ చేస్తుందని, కావో ఈ సందర్భంగా తెలియజేశారు.