వీడియో: ఈ డాగ్ ఫుట్‌బాల్ స్కిల్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు...

కుక్కలు ( Dogs ) కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలే గానీ ఇలాంటి పనైనా చేయగలవు.అంతేకాదు ఇవి ఆటలు కూడా అద్భుతంగా ఆడగలవు.

 Dog Amazing Skill Balancing Football On Head Details, Viral Video, Latest News,-TeluguStop.com

మనుషులు ఆడే ఆటల్లో కూడా ఇవి రాణించగలవు.ఇప్పటికే వాలీబాల్, క్రికెట్, సర్ఫింగ్ వంటి ఆటలు ఆడుతూ కుక్కల ఫేమస్ అయ్యాయి.

తాజాగా మరో కుక్క ఫుట్‌బాల్( Football ) దానంతట అదే ఆడుకుంటూ, బంతిని గిరగిరా తిప్పుతూ వైరల్‌గా మారింది.అది ఫుట్‌బాల్ బంతితో ప్రదర్శించిన స్కిల్స్ ( Skills ) అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఈ కుక్కకు సంబంధించిన వీడియోను @ Buitengebieden ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.అప్‌లోడ్ చేసిన కొంత సమయానికే చాలామంది దృష్టిని ఇది ఆకర్షించింది.16 లక్షల వ్యూస్ తో 33 వేల లైక్స్ తో వైరల్‌ అవుతోంది.ఈ వీడియోలో కుక్క ఆకుపచ్చ రంగు గల బంతిని ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఆడుకున్నట్లు ఆడుకోవడం మనం చూడవచ్చు.

అది బంతిని తలపైకి ఎగరేసుకొని మళ్లీ కింద పడేసి మనిషి లాగానే ఆడుకుంటుంది.

తలపై అది బంతిని బ్యాలెన్స్( Balancing Ball ) చేసిన దృశ్యాలు ఆశ్చర్యపరిచాయి.తన కాళ్ల వద్ద నుంచి బంతి పక్కకి వెళ్ళనివ్వకుండా అది చాలా ఫాస్ట్ గా దానిని తిప్పింది.ఒక బీచ్ లో ఈ కుక్క సంతోషంగా బంతితో ఆడుకుంటుండగా ఒకరు వీడియో తీశారు.

నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కుక్క బాల్స్ స్కిల్స్ చాలామంది మనుషులకంటే పర్ఫెక్ట్ గా ప్రదర్శించగలిగింది.అందుకే దీన్ని చూసి చాలా మంది వావ్ అంటున్నారు.

ఎంతో ప్రాక్టీస్ చేసి ఈ కుక్క ఈ ఆటలో బాగా నైపుణ్యం సాధించింది అని పేర్కొంటున్నారు.ఈ అమేజింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube