రవితేజ కి నాన్న గా, ఫ్రెండ్ గా, మామ గా నటించిన ఆ నటుడు ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన రవితేజ ఆ తరువాత హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఏజ్ పెరిగిన కొద్దీ తనలో ఎనర్జీ ఇంకా పెరుగుతూనే ఉంది.

 Do You Know Who Is The Actor Who Played Ravi Teja's Father, Friend And Uncle ,ra-TeluguStop.com

రీసెంట్ గా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో సక్సెస్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు.అయితే రవితేజకి ఫాదర్ గా,మామగా, ఫ్రెండ్ గా నటించిన నటుడు ఒకరు ఉన్నారు.

అలా అన్ని పాత్రల్లో నటించి మెప్పించడం అంటే మాటలు కాదు.కొన్ని పాత్రలు కొందరు మాత్రమే చేయగలరు.అలాంటి పాత్రలు చేయడం లో వాళ్ళు సిద్ద హస్తులు అనే చెప్పాలి.తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొందరికి ఏ పాత్ర ఇచ్చిన అలవోకగా చేసి మెప్పించగలరు అందులో ఒకరే ప్రకాష్ రాజ్.

 Do You Know Who Is The Actor Who Played Ravi Teja's Father, Friend And Uncle ,Ra-TeluguStop.com
Telugu Ammananna, Dhamaka, Idiot, Khadgam, Prakash Raj, Raviteja-Movie

ప్రకాష్ రాజ్ ఇడియట్ సినిమాలో రవి తేజ కి మామ గా నటించాడు.దాంట్లో ఇద్దరు పోటా పోటీగా నటించి మెప్పించారు.వీళ్లిద్దరి స్క్రీన్ ప్రెసెంటేషన్ కూడా చాలా బాగుంటుంది.అలాగే పూరి డైరెక్షన్ లోనే వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ప్రకాష్ రాజ్ రవితేజకి నాన్న గా చేస్తూనే రవితేజ కి బాక్సింగ్ లో కోచింగ్ కూడా ఇచ్చే పాత్రలో ఒదిగిపోయి నటించాడు.

Telugu Ammananna, Dhamaka, Idiot, Khadgam, Prakash Raj, Raviteja-Movie

కృష్ణవంశీ తీసిన ఖడ్గం సినిమా లో ఇద్దరు ఫ్రెండ్స్ గా నటించారు ఈ సినిమాలో కూడా వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి ఇలా క్యారెక్టర్ ఏదైనా ఒదిగిపోయి నటించడం ఒక్క ప్రకాష్ రాజ్ కి మాత్రమే చెల్లింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube