నారా మరియు నందమూరి వంశాల మద్య ఉన్న రిలేషన్ ఏంటో యావత్ తెలుగు ప్రజానీకానికి తెలుసు.నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకొని రెండు కుటుంబాల బంధానికి బాటలు వేశారు నారా చంద్రబాబు నాయిడు.
ఇక ఆ తరువాత నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మిణిని నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ వివాదం చేసుకొని నారా నందమూరి వంశాల మద్య బంధాన్ని మరింత బలపరిచారు.అయితే రెండు కుటుంబాలు కూడా రాజకీయాల పరంగాను సినిమాల పరంగాను పబ్లిక్ లో ఉండేవి కావడంతో ఈ రెండు కుటుంబాల మద్య ఏ చిన్న వార్తా బయటకు వచ్చిన అది చినికి చినికి గాలివానగా మరి సునామిలా మారుతుంది.
అయితే మొదటి నుంచి కూడా నారా ఫ్యామిలీ వల్ల నందమూరి ఫ్యామిలీకి ముప్పే అనే విమర్శను ప్రత్యర్థి పార్టీల నేతలు వినిపిస్తుంటారు.చంద్రబాబు నాయుడు వల్లే ఎన్టీ రామారావు మరణించారని, చంరబాబు తన స్వార్థం కోసమే నందమూరి వంశం పక్షాన చేరారని, ఇలా రకరకాల విమర్శలు వినిపిస్తూ ఉంటారు.ఇక ఎన్టీ రామారావు తరువాత టిడిపి భాద్యతలు భుజాన వేసుకున్న చంద్రబాబు.నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని ఆయన వంశానికి చెందిన వారసులకు ఎందుకు పట్టం కట్టలేదనే విమర్శ కూడా గట్టిగా వినిపిస్తుంటుంది.
అయితే రాబోయే రోజుల్లో టీడీపీ సారధిగా జూ.ఎన్టీఆర్ ఉండాలని ఆ పార్టీ నేతల నుంచి కూడా వినిపిస్తున్న మాట.అయితే జూ.ఎన్టీఆర్ వస్తే నారా వంశం రాజకీయంగా ఎడగలేదని భావించి జూ.ఎన్టీఆర్ ను పార్టీ దూరం చేశారని కూడా ఆరోపిస్తుంటారు చాలమంది.
ఇక తాజాగా తారకరత్న మరణాన్ని కూడా చంద్రభాబు తన రాజకీయ స్వార్థం కోసం వినియోగించుకున్నారని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.లోకేశ్ పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజే.పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురికావడం.
ఆ తరువాత 23 రోజులు చికిత్స పొందుతూ నిన్న ( ఫిబ్రవరి 19 ) మరణించారు.అయితే తారకరత్న గుండె పోటు వచ్చిన రోజే మరణించారని, అయినప్పటికి చంద్రబాబు ఆ వార్తను బయటకు రానివ్వలేదని లక్ష్మి పార్వతి ఆరోపించారు.
లోకేశ్ పాదయాత్ర కు అడ్డంకి ఏర్పడుతుందని, లోకేశ్ పాదయాత్రకు తారకరత్న మరణవార్త అపశకునంలా మారుతుందని భావించే చంద్రబాబు తారకరత్న మరణవార్తను 23 రోజులు దాచారని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చారు.దీంతో నందమూరి ఫ్యామిలీకి నారా గండం ఉందా అనే చర్చ తెరపైకి వచ్చింది.
మరి ఈ రకమైన వార్తలపై టీడీపీ నుంచి ఎలాంటి సమాధానాలు వినిపిస్తాయో చూడాలి.