మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే మీరు త్వరగా ముసలివారైపోవడం ఖాయం!

సాధారణంగా కొందరు 60 ఏళ్లు వచ్చినా కూడా చాలా యంగ్ గా కనిపిస్తుంటారు.కానీ కొందరిలో 30 ఏళ్లకే ముసలితనం లక్షణాలు కొట్టొచ్చినట్లు కనపడతాయి.

 These Are The Habits That Accelerate The Aging Process! Aging, Habits, Anti Agin-TeluguStop.com

ఇందుకు కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.మీ రోజువారీ అలవాట్లే.

మరి ఆ అలవాట్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.మనలో చాలా మంది రోజంతా కూర్చునే ఉంటారు.

మీకు ఈ అల‌వాటు ఉందా.అయితే మీరు త్వరగా ముసలి( old ) వారై పోవడం ఖాయం.

రోజంతా కూర్చునే ఉండడం వల్ల కండరాల దృఢత్వం తగ్గిపోతుంది.రక్తప్రసరణ సరిగ్గా జరగదు.

మరియు అకాల వృద్ధాప్యానికి దోహదపడే అనేక సమస్యలు తలెత్తుతాయి.అందుకే రోజంతా కూర్చునే అలవాటు ఉంటే మార్చుకోండి.

మద్యపానం, ధూమపానం( Drinking, smoking ).ఇటీవల కాలంలో చాలామంది వీటికి అలవాటు పడుతున్నారు.మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు ఇవి వృద్ధాప్యాన్ని సైతం ద్వారా తీసుకొస్తాయి.అలాగే కొందరు ఎప్పుడు పని పని అంటూ ఆ ధ్యాస లోనే ఉంటారు.

నవ్వడం మరచిపోతుంటారు.దీని కారణంగా ఒత్తిడి పెరుగుతుంది.

ఒత్తిడి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.కాబ‌ట్టి ఎప్పుడూ ప‌నిలోనే కాకుండా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో టైమ్ గ‌డ‌పండి.

జోకులు వేసుకుంటూ హాయిగా న‌వ్వుకోండి.

Telugu Habits, Tips, Latest-Telugu Health

వయసు పై బడిన కూడా మీరు యంగ్ గా కనిపించాలి అంటే కచ్చితంగా ఆహార అలవాట్లు మార్చుకోవాలి.షుగర్, మైదా( Sugar, flour ), ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.డైట్ లో పోషకాహారాన్ని చేర్చుకోవాలి.

అలాగే కంటి నిండా నిద్ర లేకపోయినా కూడా వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది.అందుకే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పడుకునేందుకు ప్రయత్నించాలి.

Telugu Habits, Tips, Latest-Telugu Health

ఇక ఎప్పుడూ ఇంట్లోనే కూర్చునే అలవాటు ఉంటే కచ్చితంగా మార్చుకోండి.స్వచ్ఛమైన గాలి మరియు సూర్యరశ్మి కి ఎక్స్పోజ్ అవడం వల్ల విటమిన్ ల లోపం తలెత్తకుండా ఉంటుంది.ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సీజన్ ఏదైనా సరే సన్ స్క్రీన్ మాత్రం కచ్చితంగా రాసుకోవాలి.సన్ స్క్రీన్ మీ చర్మానికి రక్షణ కవచంలా ఉంటుంది.

ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా చేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube