పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేసిన మంగళవారం సినిమా ( Mangalavaram Movie ) ఈరోజు చాలా గ్రాండ్ గా విడుదలైంది.ఆర్ఎక్స్ 100 ఫిలిం డైరెక్టర్ అజయ్ భూపతి ( Ajay Bhupathi ) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మరోసారి తన లక్కీ హీరోయిన్ అయిన పాయల్ రాజ్ పుత్ ని ఎంచుకున్నారు.
అయితే ఈ హీరోయిన్ కంటే ముందే మరో హీరోయిన్ ని మంగళవారం సినిమాలో నటించమని అడిగినట్లు తెలుస్తోంది.కానీ ఆ హీరోయిన్ ఈ సినిమా కంటెంట్ చూసి బోల్డ్ నెస్ ఎక్కువ ఉంది అని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.ఆ సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారం సినిమా.ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది.అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చాలామంది అభిమానులు వేయికళ్లతో ఎదురు చూసారు.అలా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ( Payal rajputh ) ని చూసి చాలామంది అభిమానులు తమ హీరోయిన్ ఖాతా లో మరో హిట్టు పడిందని వరుస అవకాశాలు రావడం ఖాయం అని కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఈ సినిమా సమయంలో పాయల్ రాజ్ పుత్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా కూడా స్టోరీ నచ్చడంతో సినిమా షూటింగ్ అయిపోయాక తన సమస్యకి చికిత్స చేయించుకోవాలి అని ఫిక్స్ అయ్యి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసింది.అయితే ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కంటే ముందే మరో హీరోయిన్ అయినా శ్రద్ధదాస్ ( Shradda das ) ని తీసుకోవాలి అనుకున్నారట.ఇక శ్రద్ధ సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం,ఆర్య -2 వంటి సినిమాల్లో నటించిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ హీరోయిన్ కి ముందు కథ చెప్పగా కథ నచ్చినప్పటికీ ఇందులో బోల్డ్ గా నటించడం ఇష్టం లేదని సినిమాని రిజెక్ట్ చేసిందట.ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ( Payal rajputh ) నటించి సూపర్ హిట్ కొట్టింది.