Samsung smartphones : లక్ష రూపాయల స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. త్వరపడండి

ఖరీదైన వస్తువులు ఆన్‌లైన్‌లో చాలా తక్కువ ధరకే వస్తుంటాయి.ఒక్కోసారి భారీ డిస్కౌంట్‌లు ఉంటాయి.

 Discount On A Smartphone Worth Rs. 1 Lakh. Hurry Up Samsung, Technology Updates,-TeluguStop.com

ముఖ్యంగా పండగల సమయంలో ఖరీదైన వస్తువులు సగం థరకే లభిస్తాయి.పండగల సమయంలో కొనుగోళ్లు అందుకే అధికంగా ఉంటాయి.

తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy S22 Plus ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.లక్షకు పైనే ఉండే దీని ధర ఆఫర్‌లో భాగంగా రూ.45,000 లోపు లభిస్తుంది.స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక డీల్‌లో బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) దాని అసలు ధర రూ.1,01,999.దీనిపై ప్రస్తుతం నేరుగా రూ.32,000 తగ్గింపుతో రూ.69,999కి కొనుగోలు చేయొచ్చు.ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా రూ.5000 వరకు అదనపు బ్యాంక్ ఆఫర్‌లు అందించబడతాయి.కొనుగోలుదారులు తన పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గుతుంది.వినియోగదారులు రూ.22,500 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.ఇలా ఆఫర్లపై స్మార్ట్‌ఫోన్ చివరికి రూ.45,000 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చు.

Telugu Bumber, Discount, Samsung, Ups-Latest News - Telugu

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ విషయానికి వస్తే 2340 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటు 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది.దీని జీపీయూ క్వాల్‌కామ్ అడెర్నో 730 అయితే, ప్రాసెసర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1.అంతేకాకుండా 8 జీబీ ర్యామ్, ఇంటర్నల్ మెమొరీ 128 జీబీ ఉంటుంది.కెమెరా విషయానికి వస్తే, స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా ట్రిపుల్ కెమెరా యూనిట్.ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 12 ఎంపీ, 10 ఎంపీ కెమెరా ఉన్నాయి.

ముందు కెమెరా 10 ఎంపీ ఉంటుంది.దీనితో రాత్రి సమయంలో కూడా అద్భుతమైన ఫొటోలను తీయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ 5జీ సపోర్ట్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube