కొన్ని సినిమాలను సీజన్స్ చాలా రక్షితాయి.డిజాస్టర్ ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలు కూడా యావరేజి రేంజ్ కి వచ్చేస్తుంటాయి.
అందుకే నిర్మాతలు తమ సినిమాలను సరైన డేట్స్ లో రిలీజ్ చేసుకోవడానికి పరితపిస్తూ ఉంటారు.అందుకు ఉదాహరణ ఈ ఏడాది ‘దసరా’ కానుకగా విడుదలైన సినిమాలే.
ముఖ్యంగా మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja )హీరో గా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం( Tiger Nageswara Rao Movie ) గురించి మాట్లాడుకోవాలి.ఈ చిత్రం పై మొదట్లో చాలా అంచనాలు ఉండేవి , కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ అంచనాలు బాగా తగ్గాయి.
టాక్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు, రన్ టైం చాలా ఎక్కువ, తలనొప్పి సినిమా అని అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.మరోపక్క యూత్ మొత్తం విజయ్ ‘లియో‘( LEO ) వైపు మొగ్గు చూపించారు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ‘భగవంత్ కేసరి‘( Bhagvanth Kesari ) వైపు ఉన్నారు.
ఈ రెండు సినిమాల మధ్యలో ‘టైగర్ నాగేశ్వర రావు‘ చిత్రం నలిగిపోతుందేమో అని అనుకున్నారు అందరూ.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా కూడా దసరా అప్పుడు కోలుకుంది.అలా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతో క్లోజ్ అయిపోతుంది అనుకున్న ఈ చిత్రం, ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 37 కోట్ల రూపాయలకు జరిగింది.
ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉండడం తో, ఈ వీకెండ్ తో 25 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుంది అని, ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిల క్లోసింగ్ తో సినిమా రన్ పూర్తి అవుతుందని అంటున్నారు.అంటే 7 కోట్ల రూపాయిల నష్టం కచ్చితంగా ఉంటుంది అన్నమాట.
ఇది కమర్షియల్ గా యావరేజి రేంజ్ అని చెప్పొచ్చు.కానీ రవితేజ( Ravi Teja ) ఊహించిన రేంజ్ లో అయితే సక్సెస్ కాలేకపోయింది ఈ చిత్రం.
ప్రారంభం లో ఈ చిత్రానికి ఆ రేంజ్ నెగటివ్ టాక్ రావడానికి కారణం రన్ టైం వల్లే.ఇది గమనించిన మేకర్స్ ఏకంగా 45 నిమిషాల సినిమాని తొలగించేసారు.ముందే ఆ పని చేసి విడుదల చేసి ఉండుంటే కచ్చితంగా ఇంకా మెరుగైన ఫలితం వచ్చేది.ఇప్పటికి కూడా ఈ సినిమాకి యావరేజి వసూళ్లు రావడానికి కారణం రన్ టైం ని ట్రిమ్ చెయ్యడం వల్లే.
ఏది ఏమైనా ఫ్లాప్ అవుతుంది అనుకున్న సినిమా ఇంత దూరం వచ్చిందట అందుకు కారణం దసరా అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.