గరమైన మైనంపల్లి..కేసీఆర్ ముందు చల్లబడ్డారా..?

బీఆర్ఎస్( BRS ) పార్టీ టికెట్లు ఖరారు చేసే సమయంలో మైనంపల్లి హనుమంతరావు హల్చల్ చేశారు.హరీష్ రావు ను టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు.

 Did Mainampalli Hanumantha Rao Get Down With Kcrs Words ,mynampally Hanumanth Ra-TeluguStop.com

నాకే కాకుండా నా కుమారుడికి కూడా టికెట్ ఇస్తేనే మంచిది లేదంటే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని బీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుట ఎగరవేశారు.

Telugu Brs, Cm Kcr, Harish Rao, Kavitha, Malkajgiri, Medak, Mla Ticket, Telangan

ఈ విధంగా ఆయన హరీష్ రావు( Harish rao ) ను బట్టలూడదీసి కొడతా, హరీష్ రావు బండారం అంతా నాకు తెలుసు అంటూ సంచలనమైన మాటలు మాట్లాడారు.నా కొడుకు మెదక్ టికెట్ విషయంలో అతనికేం అవసరం అంటూ టార్గెట్ చేశాడు.ఇలా ఆయన కామెంట్స్ చేసిన తరుణంలోనే సీఎం కేసీఆర్( KCR ) టికెట్లు ఖరారు చేశారు.

ఇందులో మైనంపల్లి హనుమంతరావు కి కూడా మల్కాజ్ గిరి అభ్యర్థిగా టికెట్ వచ్చింది.

Telugu Brs, Cm Kcr, Harish Rao, Kavitha, Malkajgiri, Medak, Mla Ticket, Telangan

మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో చూద్దాం.అయితే టికెట్లు ఖరారు చేసే కొన్ని గంటల ముందు మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumanth Rao ) ఈ విధంగా మాట్లాడారు.నేను పార్టీని వీడుతానని, తప్పనిసరిగా నాకు నా కొడుకు కు టికెట్ ఇవ్వాలని, హరీష్ రావుకు కీప్ గా ఆమె ఉందని రకరకాల మాటలతో ఆయన తిరుమల తిరుపతికి వెళ్లిన సమయంలో కామెంట్స్ చేశారు.

కేసిఆర్ లిస్టులో ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించగానే సైలెంట్ అయిపోయారు.తన కొడుకు గురించి కొట్లాడిన ఆయనను కెసిఆర్ ఒక్క దెబ్బతో సైలెంట్ చేయించారు.

ఆయన ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశారో ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మనసు మార్చుకున్నారు.బిఆర్ఎస్ లోనే కొనసాగాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.ఆ తర్వాత మల్కాజ్ గిరి( Malkajgiri ) నియోజకవర్గంలో టికెట్టు కేటాయింపుపై సంబరాలు కూడా చేయాలంటూ తమ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.అంత గరమైన మైనంపల్లి కెసిఆర్ ఒక్క నిర్ణయంతో సైలెంట్ అయిపోవడం చూస్తే కెసిఆర్ మాట ఎంత పవర్ ఫులో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube