చీర ధరించిందని అనుమతి ఇవ్వని రెస్టారెంట్ మూసివేత.చీర ధరించిందని ప్రవేశానికి అనుమతి ఇవ్వని రెస్టారెంట్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ప్రవేశం అర్హత నిబంధనల పేరుతో చీర వస్త్రధారణను నిషేధించి వివాదంలో చిక్కుకున్న ఢిల్లీలోని ఓ ఖరీదైన ఒక రెస్టారెంట్ మూతపడింది.అయితే అధికారులు మాత్రం రెస్టారెంట్ నిబంధనలు పాటించలేదు అంట దీనికి వివరణ ఇచ్చారు.
రెస్టారెంట్ సరైన వ్యాపార అనుమతులు పొందలేదని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఉందంటూ ఈ నెల 24న దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు సైతం జారీ చేసింది.అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఆ రెస్టారెంట్ నడుస్తుందని.
ప్రజారోగ్య విభాగం ఇన్ స్పెక్టర్ మూసివేత తాకిడిలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే తాము రెస్టారెంట్ ఈనెల 27 నుంచి మూసివేస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
వ్యాపార అనుమతులు పొందే వరకు రెస్టారెంట్ ను ప్రారంభించబోమని స్పష్టం చేసింది.
చీర ధరించి రెస్టారెంట్ కు రాగా ప్రవేశం అర్హత నిబంధనల ప్రకారం చీర ధరించిన వారికి తమ రెస్టారెంట్ లో ప్రవేశం లేదు అంటూ ఓ మహిళను రెస్టారెంట్ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ విషయం కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన ఆ మహిళ నిబంధనల పేరుతో.భారతదేశ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే చీర ధారణకు అవమానం జరిగిందని ఆ మహిళ ఆరోపించింది.