బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )సంచలన ఆరోపణలు చేశారు.ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.కొద్ది రోజుల్లో తనను అరెస్ట్ చేసి ఆప్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడతామని బెదిరించిందని తెలిపారు.రూ.25 కోట్లు ఇస్తాం బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని తమ ఎమ్మెల్యేలను కోరిందన్నారు.అయితే బీజేపీ ఆఫర్ ను తమ ఎమ్మెల్యేలు తిరస్కరించారని కేజ్రీవాల్ తెలిపారు.ఆప్ ఎమ్మెల్యేలు అంతా ఐక్యంగా కలిసి ఉన్నారన్నారు.అలాగే ఢిల్లీ ప్రజలు కూడా ఆప్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని చెప్పారు.ఆప్( AAP ) ను ఓడించలేక మద్యం కేసు సాకుతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.