బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై డీసీపీ మరోసారి సమీక్షించారు.తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈటల భద్రతపై డీసీపీ ఆరా తీశారు.
ఇందులో భాగంగా ఈటల రాజేందర్ నివాసంతో పాటు ఇంటి పరిసరాలను అధికారులు పరిశీలించారు.ఈ నేపథ్యంలో తన హత్యకు కుట్ర జరుగుతోందని ఈటల డీసీపీకి తెలిపారు.
ఈటల స్టేట్ మెంట్ తీసుకున్న డీసీపీ రాష్ట్ర డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు.అనంతరం భద్రత పెంపుపై డీజీపీ నేతృత్వంలో సమీక్ష జరిగే అవకాశం ఉంది.