ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించిన ‘దర్జా’ ఫస్ట్ లుక్

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘దర్జా’.సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు.

 ‘darja’ First Look Unveiled By Renowned Producer Kl Narayana , Darja, Kl Nar-TeluguStop.com

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి.ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.ఈ ఫస్ట్ లుక్ కూడా ‘దర్జా’గా ఉందని, ఈ సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని.

చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్, కెఎల్ నారాయణ, సునీల్, అనసూయ, పృథ్వీ, షకలక శంకర్‌‌తో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.‘‘ఫస్ట్ లుక్ ఆవిష్కరించి, ఆశీస్సులు అందించిన నిర్మాత కేఎల్ నారాయణ గారికి చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.అలాగే ఈ వేడుకకు వచ్చి.మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

సినిమా చాలా బాగా వస్తోంది.హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నం లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేశాం.

కామినేని శ్రీనివాస్‌గారి సపోర్ట్ మరిచిపోలేనిది.సునీల్‌గారు, అనసూయగారు, ఇతర నటీనటులు ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు.

అనసూయగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఎందుకంటే ఒకవైపు తండ్రి చనిపోయిన బాధతో ఉన్నప్పటికీ.

తన వల్ల షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకూడదని షూటింగ్‌కు వచ్చి మాకు చాలా సహకరించారు.అందుకే అనసూయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం.’’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ.చిత్రం ఘన విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని అభిలాషించారు.

‘Darja’ First Look Unveiled By Renowned Producer KL Narayana , Darja, KL Narayana, Shivashankar Paidipati, Former Health Minister Kaminey Srinivas, - Telugu Darja Kl Yana, Darja, Kl Yana

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube