ఇతర దేశాల సంగతి పక్కన బెడితే భారతీయులు బేసిగ్గా పార్టీ ప్రియులు.అదేనండి… విందులు వినోదాలు మనవారికి కాస్త ఎక్కువే.ఇక యువత అయితే చెప్పనవసరం లేదు.ఇక్కడ బిడ్డ పుడితే పార్టీ, పెరిగితే పార్టీ, వయస్సు కొచ్చారంటే పార్టీ, ఓణీల పార్టీ, లుంగీల పార్టీ, వివాహవేడుకలు, పరీక్ష పాస్ అయితే పార్టీ, పరీక్ష ఫెయిల్ అయితే పార్టీ, లవ్ లో పడితే పార్టీ, లవ్ గెలిస్తే పార్టీ, లవ్ ఫెయిల్ అయితే పార్టీ… ఇలా ఒక్కటేమిది… చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది… ఆఖరికి చచ్చిపోయినా పార్టీలు చేసుకుంటారు.
అలాంటిది కొత్త సంవత్సరం వచ్చిందంటే పార్టీ జరగకుండా ఉంటుందా? మామ్మూలుగా ఉండదు మరి.ఒళ్ళు తెలియకుండా తాగి స్పైడర్ మేన్ లాగా పాకాల్సిందే.తాజాగా మన ఇండియన్ పార్టీలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఓ ఔత్సాహికుడు పార్టీలో చేసే డ్యాన్స్ ఎలా ఉంటుందో ఫన్నీగా వివరించారు.
ఇందులో ఇండియన్స్ పార్టీ సమయంలో డ్యాన్స్ మూవ్‌లను ఏ విధంగా చూపిస్తారు అనేది చాలా ఫన్నీగా వివరించాడు.
పార్టీ డ్యాన్స్ రకాలను చూపుతూ… తొమ్మిది గంటలకు ఒకలా, 10 గంటలకు మరోలా, ఇక రాత్రి సమయం గడిచేకొద్దీ డ్యాన్స్ మరోలా చేస్తూ ఎలాంటి మార్పులు వస్తాయో.హ్యూమర్ యాడ్ చేసి చూపించాడు.పార్టీ ప్రారంభం ఇంగ్లీష్ పాటతో మొదలై చివరకు హిందీలో ముగుస్తుందన్నది ఈ వీడియోలో వినవచ్చు.
కాగా సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.ఈ వీడియోని ఇన్ స్టా గ్రామ్ దటీజ్ ఇండియన్ ఖాతా ద్వారా పోస్ట్ చేయగా వెలుగు చూసింది.
దాంతో ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.