టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య( Naga chaitanya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మన్మధుడు నాగార్జున( Nagarjuna ) తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
నాగచైతన్య చాలా సినిమాలలో నటించగా అందులో కొన్ని ప్లాప్ గా నిలిస్తే మరికొన్ని హిట్ అయ్యాయి.ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ( Custody movie ).తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు( Venkat prabhu ) దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా మే 12వ తేదీన విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది అని అభిమానులు చిత్ర బృందం అందరూ అనుకున్నప్పటికీ ఊహించని విధంగా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్ వైపు వెళ్లడమే మానేశారు.
అయితే నాగచైతన్య ఇప్పటివరకు క్లాస్ హీరోగా చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ కాగా మాస్ హీరోగా చేసిన సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.నాగ చైతన్య వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ అవి అన్నీ కూడా ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.
దీంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా చెందుతున్నారు.ఇకపోతే అక్కినేని వ్యక్తిగత జీవితం గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కలిసి ఉండి ఇటీవలె విడాకులు తీసుకొని విడిపోయారు.ఇది ఇలా ఉంటే నాగచైతన్యపు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
ఆ ఫోటోలలో నాగచైతన్య అదిరిపోయే లుక్ తో ఆహా అనిపిస్తున్నాడు.కాకుండా సినిమా సినిమాకి మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తూ అమ్మాయిల మనసులను కొల్లగొడుతున్నాడు.
ఈ మధ్యకాలంలో నాగచైతన్య హ్యాండ్సం గ్లామర్ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలు చక్కర్లు కొట్టడంతో అభిమానులు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.