కేసిఆర్ డైవర్షన్ పాలి ' ట్రిక్స్ ' ? ఈ రచ్చ అందుకా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే పనిగా బిజెపిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.బిజెపి కారణంగానే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనే విషయాన్ని పదేపదే హైలెట్ చేస్తున్నారు.

 Criticisms On Kcr Bjp To Divert From Defeat In Hujurabad Elections Kcr Ktr, Bjp,-TeluguStop.com

రైతు సమస్యలతో పాటు,  దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు, తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణం బీజేపీనే అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు.అయితే ఇప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించేందుకు కానీ,  బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేందుకు కానీ కేసీఆర్ ఇష్టపడేవారు కాదు.

బిజెపిపై విమర్శలు చేయించాలంటే పార్టీ కి చెందిన నాయకులు మంత్రులు,  ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే విమర్శలు చేసే వారు. దానికి భిన్నంగా ఇప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.

   బిజెపిని ఇరుకున పెట్టేందుకు తానే రంగంలోకి దిగిపోయారు.ఇక ప్రత్యక్షంగా బిజెపిపై పోరాడుతాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు.  కేసీఆర్ ఇంతగా బీజేపీ పై విమర్శలు చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి.హుజురాబాద్ ఎన్నికల ఫలితం బోల్తా కొట్టడంతో టిఆర్ఎస్ పని అయిపోయిందని, ఇక బిజెపి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడబోతోందని ప్రచారం మొదలు కావడంతో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టిఆర్ఎస్ వాటి నుంచి పార్టీ శ్రేణులను బయటపడేసేందుకు బిజెపి ని టార్గెట్ చేసుకున్నట్లుగా కెసిఆర్ వ్యవహారం ఉంది.

కెసిఆర్ ఈ విధంగా బీ జె పీ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసి ఉండకపోతే,  ప్రజలలోను,  రాజకీయ వర్గాల్లోనూ హుజురాబాద్ ఎన్నికల ఫలితం పైనే చర్చలు జరిగేవి.అలాగే ఈటెల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఆయన ప్రధాన అనుచరులు అందరినీ పార్టీలో చేర్చుకున్న వర్కవుట్ కాలేదనే విషయం పైన చర్చ జరిగేది .

 

Telugu Bandi Sanjay, Etela Rajendar, Hujurabad, Kcr Ktr, Telangana, Telangana Cm

   ఈ వ్యవహారాలు టిఆర్ఎస్ కు రాబోయే రోజుల్లో ఇబ్బంది కలిగించే అవకాశం ఉండటంతో,  ప్రజలు రాజకీయ వర్గాల్లో ఆ రకమైన చర్చ జరగకుండా ఈ విధంగా తన విమర్శల ద్వారా బిజెపి ని రెచ్చగొట్టి హుజురాబాద్ వ్యవహారం చర్చకు రాకుండా కేసీఆర్ తెలివిగా వ్యవహరించినట్లు గా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube