కరోనా.చైనాలోని వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ వైరస్.ఎప్పుడు ఎవరిని ఎలా ఎటాక్ చేస్తుందో తెలియడం లేదు.అతిసూక్ష్మజీవి అయిన కరోనా.ప్రపంచదేశాల మనుగడకు గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు.ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడడంతో.
కరోనా అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.
ఇక మరోవైపు కరోనా నుంచి రక్షించుకోవాలంటే.ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో మిరియాలు కూడా చాలా కీలకం ప్రాత పోషిస్తాయి.మిరియాలలో ఉండే పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ రోగ కారకాలను నిర్మూలిస్తాయి.
క్వీన్ ఆఫ్ స్పైసెస్గా పిలవబడే మిరియాలు ముఖ్యంగా ఈ కరోనా టైమ్లో మనకు ఎంతగానో మేలు చేస్తాయి.మిరియాలను నెయ్యిలో వేయించి బాగా పొడిచేసుకోవాలి.దీన్ని గోరువెచ్చని పాలలో వేసుకొని ఉదయాన్నే తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.ఇలా ప్రతిరోజు చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడతుంది.
తద్వారా కరోనా వంటి ప్రాణాంతక వైరస్లను సులువుగా ఎదుర్కోగలరు.అలాగే కండరాలు, నరాల నొప్పులు, వాపులు, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేయడంలోనూ మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి.
మరియు శరీరంలో చెడు కొవ్వును కరిగించడంలో సైతం మిరియాలు ఉపయోగపడతాయి.అందుకే ప్రతిరోజు ఖచ్చితంగా మిరియాలను ఏదో ఒక రూపంలో తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.