అమెరికాలోని సాయి భక్తుల కోసం సాయి దత్త పీటం ఏకంగా షిరిడి లాంటి ఆలయ నిర్మాణాన్ని చేపడుతోంది.అందుకు గాను న్యూజెర్సీలో సాయి దత్త పీఠం ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసింది.
విజయదశమి మరియు బాబా వారి 100 సం.ల పుణ్య తిధి సందర్భంగా పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, వేద పండితుడులు మూర్తి ల ఆధ్వర్యంలో ఈ భూమి పూజ జరిగింది…శాస్త్రానికి తగ్గట్టుగా వేద మంత్రాల మధ్య భూమి పూజని జరిపించారు.
అయితే అమెరికాలో షిరిడీ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా కళాత్మకంగా జరగనుందని.హిందు సాంప్రదాయక జీవన ఆదర్శాలు ప్రతిబింబించేలా ప్రతిష్టాత్మకంగా ఈ “అమెరికా లో షిరిడీ” జరుగుతుందని…అచ్చం షిరిడీ ఆలయాని తలపించేలా ఈ ఆలయం యొక్క నిర్మాణం జరుగుతుందని ముంబయి కి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ తెలిపారు.
అంతేకాదు ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన దాతల వివరాలని ఆలయ గోడల మీద ఉంచుతామని.విరాళాలు ఇచ్చే భక్తుల పేర్లని సైతం గోడలపై ఉంచుతామని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు, ఇంజనీర్, ఆర్కిటెక్ట్ , సాయి దత్త పీఠం బోర్డు డైరెక్టర్స్ అందరూ హాజరయ్యారు.