తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాపై స్పందించిన ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
గజ్వేల్ లో ఓటమి తప్పదనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయి పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.కేసీఆర్ కు షబ్బీర్ అలీ చేతిలో ఓటమి తప్పదని చెప్పారు.
తాము మూడింతల రెండు వంతుల మెజార్టీతో గెలుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.అయితే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగులకు సీట్లు ఇవ్వాలని తాను సవాల్ చేశానన్న ఆయన చాలా చోట్ల కేసీఆర్ అభ్యర్థులను మార్చారని విమర్శించారు.
కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూసిన తరువాత రాష్ట్ర ప్రజలకు ఇక ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని అర్థం అయిందని తెలిపారు.సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తెలిపారు.