షర్మిల చేరికపై కాంగ్రెస్ తేల్చేసినట్లేనా?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.చాలాకాలం క్రిందటే వైఎస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తుందని వార్తలు వచ్చాయి.

 Congress Decided On Sharmila's Inclusion?,ysrtp,congress,ys Sharmila,revanth Red-TeluguStop.com

ఆ తదనంతర పరిణామాలు కూడా దానికి తగినట్లే నడిచాయి.ఆమె డీకే శివకుమార్( DK Shiva Kuumar ) ను పలుమార్లు కలవడం, చివరకు గాంధీ కుటుంభం తో సమావేశం అవటం ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో కూడా మీరు అనుకున్నదే జరుగుతుందంటూ హింట్ ఇవ్వడంతో ఆమె పార్టీ విలీనం ఇక లాంచనమే అని అందరూ భావించారు.

అయితే ఆ తరువాత మాత్రం కధ ముందుకు కదలలేదు .

Telugu Congress, Dk Shiva Kumar, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Ys Shar

అయితే షర్మిల పెట్టిన కొన్ని షరతులు ఇప్పుడు ఆమె పార్టీ విలీనానికి అడ్డంకులుగా మారినట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా షర్మిల విలీనానికి కాంగ్రెస్( Congress Alliance ) అంగీకరించినప్పటి పరిస్థితులకి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితులకి చాలా తేడా ఉందని అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెద్దగా లేకపోవడంతో కలిసి వచ్చే ప్రతి పార్టీని కలుపుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.అయితే అధికార బారాస అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పరిస్థితి మారింది.

అధికార పార్టీలో టికెట్ దక్కని చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్కు క్యూ కట్టారు.అందులో పూర్తి నియోజకవర్గాన్ని సైతం ప్రభావితం చేయగలిగే పెద్ద స్థాయి నేతలు కూడా ఉన్నారు.

అంతేకాకుండా వామపక్షాలు కూడా కాంగ్రెస్తో జట్టు కట్టడానికి సిద్ధమయ్యాయి .ఇప్పుడు అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ కిక్కిరిసిపోయింది.

Telugu Congress, Dk Shiva Kumar, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Ys Shar

ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల తప్ప పెద్దగా గుర్తింపు పొందిన నేతలు కూడా ఆమె పార్టీలో ఎవరూ లేకపోవడం ఆమె తనతో పాటు మరి కొంతమందికి టికెట్లు ఆశించడం పైగా ఆమెపై ఆంధ్ర ముద్ర ఉందని రేవంత్ రెడ్డి వర్గం తో పాటు మరి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు( Senior Congress Leaders ) కూడా వాదించడంతో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన లో పడినట్లుగా తెలుస్తుంది.దీనికి తోడు తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ సునీల్ కనుగోలు కూడా షర్మిల కాంగ్రెస్ చేరిక వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదని తేల్చి చెప్పేసినట్టుగా ప్రచారం జరుగుతుంది .దాంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిలను లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు కేవలం ఒక సీటు హామీ తో ఆమె కాంగ్రెస్లో చేరతారా లేక తనతో నడిచిన నాయకులకు న్యాయం చేయడం కోసం ఒంటరి పోరు కే సిద్ధమవుతారా అన్నది మరికొద్ది రోజుల్లో ఒక అవగాహన రావచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube