తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న అల్లు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్ వారసులుగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అల్లు అర్జున్ బాటలోనే తన తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.ఈ క్రమంలోనే అల్లు శిరీష్ పలు చిత్రాలలో నటించిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు శిరీష్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఎన్నో రకాల ఫోటో ఎడిటర్ ఫోటో ఫిల్టర్స్ ఉండడంతో ప్రతి ఒక్కరు వారికి నచ్చిన విధంగా వారి ఫోటోలను మార్పులు చేస్తూ ఉంటారు.
ఇలా అల్లు శిరీష్ ఫిల్టర్ చేసిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటో పై కామెంట్లు చేశారు.
ఇకపోతే ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ.ఎలాంటి ఫిల్టర్ ఎఫెక్ట్స్ లేకున్నా అల్లు బాబు గారి ఫేస్ అలాగే ఉంటుంది అంటూ కామెంట్ చేశారు.
ఇక ఈ కామెంట్ పై అల్లు శిరీష్ స్పందిస్తూ.తనదైన శైలిలో సదరు నెటిజన్ కి పంచ్ వేశారు.ఈ క్రమంలోనే అల్లు శిరీష్ స్పందిస్తూ నా పై కామెంట్ చేసావని నేను స్పందించలేదు సిస్టర్.డిపిలో ఉన్న ఈ అమ్మాయి కూడా అందం గురించి మాట్లాడుతుందే అని ఫీల్ అవుతున్నా.
అంటూ ఆమెకు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడమే కాకుండా.నువ్వు మాత్రం ఫిల్టర్ వాడు ప్లీజ్ అంటూ తన పై కామెంట్ చేసిన వ్యక్తికి తనదైన శైలిలో అల్లు శిరీష్ అల్టిమేట్ పంచ్ వేశాడు.
ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.