రంగబలి సినిమా( Rangabali ) శుక్రవారం థియేటర్ లలో విడుదలైంది.ఈ శుక్రవారం చాలా సినిమాలు విడుదల కాగా రంగబలి సినిమాపై ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఈ సినిమాలో నాగశౌర్య హీరో అయినప్పటికీ సినిమా చూసిన వారందరు ఈ సినిమాకి సత్యనే హీరో అంటున్నారు.సత్య లేకపోతే రంగబలి కాస్త బలి అయ్యేది అని టాక్ చెబుతున్నారు.ఈ సినిమా విడుదలకి ముందే సత్య తన వెరైటీ స్టైల్ తో ఇంటర్వూస్ చేయడం మరింత హైప్ ని తెచ్చింది అనే చెప్పాలి.ss=”middlecontentimg”>
నాగశౌర్య( Naga Shaurya ) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.రొటీన్ కథలు కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు.అయితే ఛలో తర్వాత ఇతనికి ఆ రేంజ్ హిట్ మాత్రం పడలేదు.ఆ తరువాత చాలా సినిమాలు చేసిన పెద్ద హిట్ మాత్రం ఇంకా రాలేదు.ఈ నేపథ్యంలో పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రంగబలి మూవీ చేసాడు.ఈ సినిమా ట్రైలర్, ప్రోమోలు పాజిటివ్ టాక్ ని తెచ్చాయి.
శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి పబ్లిక్ టాక్ వచ్చేసింది.సినిమా చూసిన వారందరు ఈ సినిమాకి మెయిన్ హీరో సత్య అనే చెబుతున్నారు.ఓ రకంగా సత్య( Satya ) ఈ సినిమాను గట్టెక్కించే ప్రయత్నం చేసారని, తన కామెడీతో అందరినీ నవ్వించారని, సత్య లేకపోతే ఈ సినిమా బలయ్యేదని చెబుతున్నారు.ss=”middlecontentimg”>
సినిమా విడుదల కాకముందే ఈ సినిమాని సత్య తన స్టైల్ లో ప్రమోషన్ చేసాడు.సినిమాలో కూడా హీరో నాగశౌర్య అయినా సరే, సినిమాలో బలంగా ఆకట్టుకునేది, సినిమా నిలబడింది కేవలం సత్య వల్లే.దర్శకుడు సత్యకి మంచి క్యారెక్టర్ రాసి స్క్రీన్ పై ఎక్కువసేపు కనిపించే స్కోప్ ని కూడా ఇచ్చాడు.
దీనికి నాగశౌర్య కూడా సపోర్ట్ చేయడంతో సత్యకి మంచి రోల్ దొరికింది.కమెడియన్ లలో సత్య మంచి ఫామ్ లో ఉన్నది.బ్రహ్మానందం తరువాత చాలా మంది కామెడీ ట్రై చేస్తున్న అతి తక్కువ మందే రాణిస్తున్నారు.ఇప్పుడు సత్య పూర్తిగా నవ్వించే పాత్రలనే ఎక్కువగా చేస్తున్నారు.
రంగబలి సినిమా మొదటి హాఫ్ మొత్తం సత్యనే హీరో అన్నట్టు కనిపించింది.రంగబలి సినిమాకు సత్య ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.