ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ చెడు పనులను ఎక్కువగా చేస్తూ ఉన్నారు.ప్రస్తుత కాలం ఎలాగా మారిందంటే ఆల్కహాల్ తీసుకోకపోతే అదేదో మంచి పద్ధతి కాదు అనే లాగా మారిపోయింది.
ఈ ఆల్కహాల్ ను మోతాదుకి మించి తాగేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత సమాజంలోని పరిస్థితి ఎలాగా ఉంది అంటే దాదాపు ఆల్కహాల్ తాగని వారు ఎవరూ లేరేమో అన్నట్టుగా ఉంది.
నిజానికి ఆల్కహాల్ ను అప్పుడప్పుడు తాగితే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఏదో ప్రతి రోజు నీరు తాగేలాగా ఎంత బడితే అంత తాగితే పోయేకాలం వచ్చినట్లే.ఇలా ఆల్కహాల్ ప్రతిరోజు మోతాదుకు మించి తాగడం వల్ల వయసు పెరిగిపోయిన వారిలో కచ్చితంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా యువతలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు పెరిగిపోతున్నాయి.మద్యపానాన్ని తగ్గించడం ద్వారా యువతలో స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.ఈ మధ్యపానం వల్ల చాలామంది ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయి.రోజులో ఎక్కువగా మద్యం సేవించే వ్యక్తులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రెండు సంవత్సరాలపాటు మద్యాన్ని ఎక్కువగా సేవించిన వారిలో స్టాక్ వచ్చే ప్రమాదం ఉంది.అంతేకాకుండా వీరిలో అధిక రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉంది.అంతేకాకుండా మెదడులో రక్తస్రావం ఏర్పడి మైడ్ డెడ్ అయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.అందువల్ల ధూమపానం, మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు.