విశాఖలో సంచలనం సృష్టించిన నోట్ల మార్పిడి దందాలో పోలీసులు చేతివాటం ప్రదర్శించారని తెలుస్తోంది.ఏఆర్ సీఐ స్వర్ణలత ముఠా ఇద్దరు రిటైర్డ్ నేవీ అధికారులను టార్గెట్ చేసినట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే రిటైర్డ్ నేవీ అధికారులను ప్లాన్ ప్రకారం నిందితులు దోచుకున్నారు.బాధితులను బెదిరింపులకు గురి చేసిన మహిళా సీఐ, హోంగార్డ్, కానిస్టేబుల్ లు డబ్బులు తీసుకున్నారని అధికారులు గుర్తించారు.
కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సూరిబాబుగా నిర్ధారించారు.రూ.90 లక్షలు 500 నోట్లు ఇస్తే రూ.కోటి 2 వేల నోట్లు ఇస్తానని సూరిబాబు రిటైర్డ్ నేవీ అధికారులను నమ్మబలికారు.దీంతో కొల్లి శ్రీను, శ్రీధర్ అనే రిటైర్డ్ అధికారులు డబ్బులు తీసుకుని సీతమ్మధారకు వచ్చారు.మరోవైపు హోంగార్డ్, కానిస్టేబుల్ తో కలిసి స్వర్ణలత అక్కడకు వచ్చారు.డబ్బు ఎక్కడిదంటూ సూరిబాబును నిలదీస్తున్నట్లు డ్రామా నడిపారు.ఈ క్రమంలో రిటైర్డ్ అధికారులతో సూరిబాబు మంతనాలు జరపగా రూ.12 లక్షలు ఇస్తే బయటపడొచ్చని ఒప్పించారు.దీంతో రూ.12 లక్షలు ఇచ్చిన కొల్లి శ్రీను, శ్రీధర్ లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం సూరిబాబుపై అనుమానంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.