శిరోజాల సంరక్షణలో కొబ్బరి నూనె ముఖ్య పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే.జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒత్తుగా పెరగాలన్నా కొబ్బరి నూనె గ్రేట్‌గా సహాపడుతుంది.
అయితే జుట్టుకే కాదు.ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.
మరి కొబ్బరి నూనె ముఖానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్లో కొబ్బరి నూనె తీసుకుని.
అందులో కాఫీ పవర్ మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని బాగా ఆరనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో రుద్దుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై మృతకణాలు తొలగి.
కాంతివంతంగా మారుతుంది.
అలాగే కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని.
అందులో ఆలీవ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
పావు గంట తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ముడతలు పోయి.
ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.కొబ్బరి నూనెలో కొద్దిగా పంచదార వేసి.
పెదాలకు రుద్ది అనంతరం క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల పెదాలు పింక్ కలర్లోకి వస్తాయి.
ఇక మొటిమలు, మచ్చలతో బాధపడేవారికి కొబ్బరి నూనె అద్భుతంగా ఉపయోగపడుతుంది.అందుకు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి.
ముఖానికి అప్లై చేయాలి.పది నిమిషాల పాటు ఆరనిచ్చి.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు సులువుగా తగ్గిపోతాయి.