మహిళపై చేరి బుసలు కొట్టిన పాము, నాగరాజుకు ప్రార్థించగానే..!

పాములు అంటే భయంతో పాటు భక్తి కూడా ఉంటుంది జనాలకు.పామును చూడగానే హడలి పోయే వారు కూడా నాగుల పంచమి నాడు పుట్ట వద్దకు వెళ్లి పాలు పోస్తారు.

 Cobra Sitting With Its Head Raised On A Sleeping Woman In Karnatak , Cobra Sitti-TeluguStop.com

నాగదేవతా మమ్మల్ని రక్షించు అంటూ వేడుకుంటారు.వచ్చే ఏడు ప్రత్యేక పూజలు చేస్తానని మొక్కుతుంటారు.

పామును చూడగానే నాగదేవత అని నాగరాజు అని పూజించే వాళ్లు లేకపోలేదు.అయితే పాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించినప్పుడు వచ్చే భక్తి కాదు భయం.కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ మాత్రం భయంలోనూ భక్తిని చూపించి బతికిపోయింది.ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలో ఏముందంటే.అది కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా.అఫ్జల్ పుర్ తాలూకా మల్లాబాద్ అనే గ్రామంలో నివసిస్తుంది భాగమ్మ అనే మహిళ.ఒక రోజు తన ఇంటి పెరటిలోని చెట్టు కింద మంచం వేసుకుని చల్లని గాలికి హాయిగా పడుకుంది.

ఆ సమయంలో ఓ నాగుపాము ఆమెపైకి చేరింది.పడగవిప్పి బుసలు కొడుతూ ఆమెపై కూర్చుంది.

ఆ పాముని చూసిన భాగమ్మ ఏమాత్రం భయపడకుండా.కళ్లు మూసుకుని శ్రీశైల మల్లయ్య, జై మల్లిఖార్జున, స్వామీ గ్వార్దు నన్నప్ప అంటూ దేవుళ్ల పేర్లు స్తూతించింది.

కాసేపటికి ఆ పాము ఆమెను ఏమీ చేయకుండా మెల్లిగా అక్కడి నుండి వెళ్లి పోయింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube