తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం, వాటి మార్గదర్శకాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని తెలుస్తోంది.రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఆర్టీసీపై సమీక్ష ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.