చిరంజీవి( Chiranjeevi ) వశిష్ట కాంబినేషన్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ కాగా ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది.చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి త్రిష( Trisha ) ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.
ఈ సినిమాలో విలన్ గా రానా నటిస్తారని వార్తలు వినిపించినా బాలీవుడ్ నటుడు కునల్ కిషోర్ కపూర్ విలన్ గా ఎంపికయ్యారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.రానా డేట్ల సమస్య వల్ల ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి ఈ సినిమాలో నటిస్తున్నారు.మరి కొందరు హీరోయిన్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో నటించాల్సి ఉండగా ఆ పాత్రలకు ఏ హీరోయిన్లు ఎంపికవుతారనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.
ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
రంగ్ దే బసందీ, మరికొన్ని సినిమాలలో నటించిన కునల్ కిషోర్ కపూర్( Kunal Kapoor ) చిరంజీవికి విలన్ గా పర్ఫెక్ట్ ఛాయిస్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఈ సినిమాకు 65 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.
మరోవైపు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల బింబిసార2( Bimbisara 2 ) సినిమాకు మల్లిడి వశిష్ట పని చేయడం లేదని కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )క్లారిటీ ఇచ్చారు.మరో డైరెక్టర్ డైరెక్షన్ లో బింబిసార2 తెరకెక్కుతుందా అనే ప్రశ్నకు త్వరలో ఆ ప్రశ్నలకు సమాధానం దొరకనుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.చిరంజీవి వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
చిరంజీవి వశిష్ట సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.