కొన్ని సంవత్సరాల నుండి బ్రహ్మానందం( Brahmanandam ) సినిమాలు గతంలో మాదిరిగా చేయడం లేదు.ఒకప్పుడు బ్రహ్మానందం లేనిదే ఏ సినిమా ఉండేది కాదు.
చాలా సినిమాలలో బ్రహ్మానందం కామెడీతో సెకండ్ హాఫ్ సినిమాని రన్ చేసి హిట్టు కొట్టిన దర్శకులు.చాలామంది ఉన్నారు.
కానీ గత కొంతకాలం నుండి గతంలో మాదిరిగా బ్రహ్మానందం సినిమాలలో కనిపించడం లేదు.ఈ క్రమంలో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతున్నారు.
మరోపక్క రకరకాల బొమ్మలు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా “నేను”( Nenu ) అనే టైటిల్ పేరిట పుస్తకం రాయడం జరిగింది.మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కమెడియన్ బ్రహ్మానందం రాసిన “నేను” పుస్తకంపై ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు.”నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి
ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందిoచటం ఎంతో ఆనందదాయకం.తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు, మార్గదర్శకము అవ్వొచ్చు.ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను”.
అని చిరంజీవి పోస్ట్ పెట్టడం జరిగింది.