రామ్ చరణ్ కి అదిరిపోయే రేంజ్ లో విషెస్ చేసిన చిరంజీవి

తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటుడుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నట వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి మొదటి సినిమాతో సత్తా చాటిన రామ్ చరణ్ రెండో సినిమా మగదీరతో రికార్డులు తిరగరాశాడు.ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస హిట్స్ తో దూసుకొచ్చి స్టార్ హీరోగా, మెగాస్టార్ చిరంజీవికి సరైన వారసుడుగా నిలబడ్డాడు.

 Chiranjeevi Birth Day Wishes To Ram Charan In Twitter, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

అయితే ఎన్ని హిట్స్ వచ్చిన రామ్ చరణ్ నటుడుగా ప్రూవ్ చేసుకోలేదని, కేవలం చిరంజీవి కారణంగా వచ్చిన ఇమేజ్ తోనే స్టార్ హీరో అయిపోయాడని విమర్శలు వినిపించాయి.

Telugu Chiranjeeviday, Telugu, Tollywood-

ఇక ఆలాంటి విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టి తను మంచి నటుడుని అని రంగస్థలం సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు.అందులో చెవిటివాడిగా కనిపించి సినిమాని ఆద్యంతం భుజాల మీద వేసుకొని నడిపించాడు.అన్ని రకాల ఎమోషన్స్ లో రంగస్థలం సినిమా ద్వారా చూపించి, కంప్లీట్ నటుడుగా రామ్ చరణ్ మారిపోయాడు.

తన కొడుకు ప్రయోజకుడు కావడం కంటే ఒక తండ్రికి ఆనందం ఏముంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ నేపధ్యంలోనే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చిన చిరంజీవి అదిరిపోయే పోస్ట్ చేశారు.

రామ్ చరణ్ పుట్టినరోజు సహజంగా ఉప్పొంగిపోయా అయితే అతను ప్రపంచ రంగస్థలం రోజు ఎందుకు పుట్టాడో ఆ రోజు నాకు అర్ధం కాలేదు.కాని చేపకి ఈదడం ఎలా అబ్బిందో చరణ్ కూడా అలాగే నటనలో తనని తాను తీర్చిదిద్దుకున్నాడు.

ఇది అన్ని పండగలలో కెల్ల ప్రత్యేకం అంటూ పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube