కోవర్ట్ ల దెబ్బకు కోలుకోలేకపోతున్నారా ? 

టీడీపీ లో కోవర్టులు ఉన్నారనే విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు బయటపెట్టారు.కోవర్ట్ ల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుగా అంచనా వేయలేకపోవడంతోనే భారీగా దెబ్బతిన్నట్లు చంద్రబాబుకు నివేదికలు అందాయి.

 Chandrababu Noted That The Tdp Was Facing A Series Of Defeats Due To Covert Lead-TeluguStop.com

అందుకే కోవర్టులు విషయంలో బహిరంగంగానే ఆయన స్పందించారు.ఇక కోవర్టులు ఎవరనేది త్వరలోనే పూర్తి స్థాయిలో గుర్తిస్తామని,  వారిని ఉపేక్షించేది లేదు అంటూ చంద్రబాబు ఆగ్రహం గానే మాట్లాడుతున్నారు.

ఈ మేరకు పార్టీ కీలక నాయకులకు హెచ్చరికలు చేశారు.అయితే కోవర్ట్ లు ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు ఆలస్యంగానే గుర్తించారు .ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.పార్టీ ఓటమి చెంది అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది.

అప్పటి నుంచి వరుసగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ టీడీపీకి పరాజయమే ఎదురవుతోంది.  గెలుస్తాము అనుకున్న చోట్ల కూడా పార్టీ ఓటమి చెందుతుండటం బాబుకు ముందుగా అర్థం కాకపోయినా,  ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు అర్థం అవుతున్నాయి.

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందినా,  40 శాతం ఓట్లను సాధించింది.కానీ టీడీపీ ఓటమి తరువాత అనేక మంది నేతలు వైసీపీకి అనుకూలంగా మారారు.

  కొంతమంది పార్టీకి రాజీనామా చేసి నేరుగా వైసీపీలో చేరగా, మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉంటూ బహిరంగంగానే వైసీపీ కి మద్దతు తెలుపుతున్నారు.కొన్ని కొన్ని చోట్ల కీలకమైన నాయకులు అనుకున్నవారు టీడీపీ లోనే ఉంటూ రహస్యంగా వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడం,  టీడీపీలో ఉన్నా,  తమకు ఏ ఇబ్బంది లేకుండా వారు ముందుగానే వైసీపీకి సరెండర్ అయిపోవడం,  కేసులు , వ్యాపార వ్యవహారాలలో దెబ్బతినకుండా జాగ్రత్త పడడం, టీడీపీలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు గురించి ఎప్పటికప్పుడు వైసీపీ నేతలకు సమాచారాన్ని చేరవేయడం,  ఇలా ఎన్నో అంశాలు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు నివేదికలు అందుతున్నాయి.

Telugu Ap Cm Jagan, Chandrababu, Covert, Jagan, Janasena, Kuppam Mincipal, Nellu

ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడానికి,  అలాగే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడానికి కారణం కోవర్ట్  రాజకీయాలనే విషయం బాబుకు అర్థమైంది.జరిగిన నష్టం ఏదో జరిగింది ఇప్పుడైనా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని , నియోజకవర్గాల ఇన్చార్జిలు , కీలకమైన పదవులు విషయంలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని బాబు డిసైడ్ అయ్యారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube