రాముని కోసం బంగారు పాదరక్షలు.. 8 వేల కి.మీ పాదయాత్ర చేస్తున్న వ్యక్తి.. ఇతని భక్తికి ఫిదా కావాల్సిందే!

అయోధ్యలో రామ మందిరం( Ram Mandir ) ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ నెల 22వ తేదీన రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.

 Challa Srinivas Sastry Carrying Golden Feet For Lord Ram On A Divine Walk To Ayo-TeluguStop.com

హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి( Challa Srinivas Sastry ) బంగారు పాదుకలను తలపై పెట్టుకుని అయోధ్యకు 8 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ తన భక్తిని చాటుకుంటున్నారు.ఇప్పటికే యూపీలోని చిత్రకూట్ కు చేరుకున్న ఆ వ్యక్తి అయోధ్యకు చేరుకుని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలుస్తానని చెబుతున్నారు.

చల్లా శ్రీనివాస్ శాస్త్రి వయస్సు ప్రస్తుతం 64 సంవత్సరాలు కావడం గమనార్హం.

Telugu Km Walk, Ayodhya, Challasrinivas, Divine Walk, Golden Feet, Hyderabad, Lo

రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే 5 లక్షల ఇటుకలను డొనేట్ చేసిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి నాన్న శ్రీరాముని భక్తుడని అయోధ్యలో( Ayodhya ) రామ మందిరం నిర్మిస్తే చూడాలనేది నాన్న కల అని చెబుతున్నారు.నాన్న కల నెరవేర్చాలనే ఆలోచనతో బంగారు పాదుకలు తీసుకుని అయోధ్యకు వెళుతున్నానని చల్లా శ్రీనివాస్ శాస్త్రి వెల్లడిస్తున్నారు.మరోవైపు అయోధ్యలో సుందరీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

Telugu Km Walk, Ayodhya, Challasrinivas, Divine Walk, Golden Feet, Hyderabad, Lo

అధికారులు రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటుతూ ఆహ్లాదాన్ని పెంచుతున్నారు.ఈ మొక్కలలో కొన్ని మొక్కలు రామాయణ కాలం నాటి మొక్కలు అని తెలుస్తోంది.ప్రదాని మోదీ( PM Modi ) చేతుల మీదుగా రాములవారి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అయోధ్యలో అమృత మహోత్సవ్ కార్యక్రమం( Amrit Mahotsav ) సైతం జరగనుంది.

రామ భక్తులకు రక్షణ కల్పించడం కోసం తాత్కాలిక డేరాలను నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

Telugu Km Walk, Ayodhya, Challasrinivas, Divine Walk, Golden Feet, Hyderabad, Lo

15 వేల మంది భక్తుల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.ముగ్గురు శిల్పులు రాముని విగ్రహాలను తయారు చేయగా రామ మందిర్ ట్రస్ట్ కమిటీ ఒక విగ్రహాన్ని ఎంపిక చేయనుంది.శ్రీరాముని బాల్య స్వభావాన్ని ప్రతిబింబించే విగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube