ఐటీఐఆర్ మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఐటీఐఆర్ అంశంలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.
ఐటీఐఆర్ పై కేంద్రానికి ఎన్నోసార్లు డీపీఆర్ ఇచ్చామని కేటీఆర్ తెలిపారు.2018 వరకు ఐటీఐఆర్ పై కేంద్రం సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.బెంగళూరు, హైదరాబాద్ ఐటీఐఆర్ రద్దు చేస్తున్నట్లు కేంద్రమే చెప్పిందన్నారు.ఐటీ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది కేంద్రమేనని విమర్శించారు.