ఇటీవల ఎగుమతుల విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది .ఇప్పటికే బాస్మతి బియ్యం( Basmati Rice ) ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడంతో, అగ్ర దేశాలు అల్లల్లాడిపోతున్నాయి.
అమెరికాలో బియ్యం కోసం పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు క్యూ కట్టడం వంటివి బాగా వైరల్ అయ్యాయి.బియ్యంతో పాటు అనేక ఆహార ఉత్పత్తులపై నిషేధం విధించే విధంగా కేంద్రం ముందుకు వెళ్తోంది.
ఇప్పటికే బియ్యంపై కేంద్రం నిషేదం విదించగా, ఆ జాబితాలో చెక్కర కూడా చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.బియ్యం ఎగుమతి పై నిషేధం విధించగా ఆ జాబితాలో ఇప్పుడు చక్కెర పేరు కూడా వినిపిస్తోంది.
ఆహార భద్రత, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళనకు స్పష్టమైన సంకేతం అని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇథనాల్ పైనా కేంద్రం( Ethanol ) నిషేధం విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు .ఇప్పటికే సంక్షోభం కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్ పై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.భారత్ చెక్కెర విషయంలో నిషేధం విధించే ఆలోచనకు రావడానికి కారణం ఇదే .దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు బియ్యంపై నిషేధం విధించింది.ప్రధానంగా ఉన్న చక్కెర పైన ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుందడంతో వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచ సరఫరాలు కఠిన తరం కావడంతో, దక్షిణాసియా దేశాల నుంచి ప్రపంచ చెక్కెర ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.భారత్ వంటి దేశంలో అసమానమైన వర్షపాతం నమోదు కావడం వంటివి చెరుకు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
దీంతో చెరుకు పంట దిగుబడి బాగా తగ్గింది.ఈ కారణంతోనూ చక్కెర ఎగుమతి పై( Sugar export ) నిషేధం విధించాలని నిర్ణయించుకోవడానికి కారణంగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
దేశీయం గా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు ,బియ్యం పై నిషేధం విధించగా , ఇప్పుడు ఆ లిస్టులో చెక్కర, ఇథనాల్ చేరబోతున్నాయి .భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అగ్రదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ నుంచి ఎగుమతులు నిలిచిపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయమూ ప్రపంచ దేశాల్లో నెలకొంది.