హాలీవుడ్ హీరోలకు దీటుగా స్టంట్స్ చేస్తున్న పిల్లి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

లెజెండరీ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ఫిల్మ్ సిరీస్( Mission Impossible ) అదిరిపోయే స్టంట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది.అయితే, ఈ స్టంట్స్‌ను ఏ మనిషి కూడా రియల్ లైఫ్ లో ట్రై చేయాలని అనుకోరు.

 Cat Mission Impaw-ssible Viral Video,cat,cat Videos,funny Videos,funny Cat,viral-TeluguStop.com

కానీ ఒక పిల్లి మాత్రం ఈ సినిమాల్లోని యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలను గుర్తుకు తెచ్చే స్టంట్‌ను ప్రదర్శించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా మంది ఇంటర్నెట్ యూజర్లను ఆకర్షించింది, ప్రొఫెషనల్ స్టంట్ పెర్ఫార్మర్స్ వలె చాలా నైపుణ్యంతో ఈ పిల్లి ఒక ఛాలెంజింగ్ మార్గంలో ప్రయాణించడం మనం వైరల్ వీడియోలో చూడవచ్చు.

ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌( X Platform )లో షేర్ చేసిన ఈ క్యాట్ వీడియో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో టామ్ క్రూజ్ సాహసోపేతమైన స్టంట్స్ ను మైమరిపిస్తుంది.

ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది, 36 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వీడియో ఓపెన్ చేస్తే, పిల్లి చాలా ఎత్తులో పక్కపక్కనే ఉన్న రెండు సన్నటి పైపులపై తన నాలుగు కాళ్లతో నడుస్తూ కనిపిస్తుంది.పిల్లి ఇరుకైన పైపులపై చాలా సింపుల్‌గా నడుస్తూ ముందుకు వెళ్తుంది.

అద్భుతమైన బ్యాలెన్స్, కంట్రోల్‌ను ఇది ప్రదర్శిస్తుంది.అది చాలా ఎత్తులో ఉన్న ప్రమాదకరమైన మార్గం అయినప్పటికీ, పిల్లి కాన్ఫిడెంట్‌గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడుస్తూ వెళ్లింది.

దాని ధైర్యం, నైపుణ్యం చూసి చాలా మంది నోరెళ్ల బెడుతున్నారు.వీడియోను షేర్ చేసిన ఎక్స్‌ పేజీ జోక్‌గా “మిషన్ ఇంపాజిబుల్” అని క్యాప్షన్ ఇచ్చింది.

వీడియోలోని పిల్లి చేష్టలకు వ్యూయర్స్‌ ముగ్ధులయ్యారు.కొంతమంది వ్యూయర్స్‌ పిల్లి( Cat ) ప్రవర్తన విలక్షణమైనదని వ్యాఖ్యానించగా, మరికొందరు పిల్లి అద్భుతమైన సామర్థ్యాలను చూసి ముగ్ధులయ్యారు.

వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో పిల్లి నైపుణ్యానికి ఒక వీక్షకుడు ప్రశంసలు వ్యక్తం చేశాడు.మరో యూజర్ పిల్లి సీక్రెట్ మిషన్‌లో ఉన్నట్లుగా ఉందని సరదాగా వ్యాఖ్యానించాడు.

క్లిష్ట పరిస్థితులను సాహసాలుగా మార్చగల పిల్లి సామర్థ్యాన్ని చూసి వేరే నెటిజన్ ఆశ్చర్యపోయారు, పిల్లుల సహజమైన సామర్థ్యాలు, సంకల్పం చాలా కష్టమైన పనులను కూడా సులభం అనిపించేలా చేస్తాయి.మరో వీక్షకుడు పిల్లికి మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ ఇచ్చి ఉండవచ్చని హాస్యాస్పదంగా సూచించారు.మొత్తం మీద పిల్లి స్టంట్ వీడియో యూజర్లను అలరించడమే కాకుండా పిల్లుల చురుకుదనం, స్కిల్స్ హైలైట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube