పరీక్ష రాసేందుకు వెళ్తూ ఆక్సిడెంట్...! నిర్లక్షమే కారణం..! షాకింగ్ వీడియో.!!!

నడిరోడ్డుపై నిర్లక్ష్యం ఓ విద్యార్థిని పొట్టన బెట్టుకుంది.ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా యువత పెడచేవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగులో గురువారం చోటుచేసుకున్నఓ రోడ్డు ప్రమాదం.నిర్లక్ష్య డ్రైవింగ్‌కు అద్దం పడుతోంది.

ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాదపు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

వివరాలలోకి వెళ్తే…ముగ్గురు మిత్రులు కలిసి పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ సంఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద చోటు చేసుకుంది.ఘట్ కేసర్ మండలం అవుషాపూర్ శివారులోని వీబీఐటీ కళాశాలలో పరీక్షలు రాసేందుకు స్నేహితుడు సాయిరాంతో కలిసి నేలపట్ల శివ స్కూటీపై బయలుదేరాడు.

మార్గమధ్యలో బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామానికి చెందిన మామిళ్ల భరత్ అనే మరో స్నేహితుడిని బీబీనగర్ లో స్కూటీపై ఎక్కించుకుని ముగ్గురు కలిసి వీబీఐటీ కళాశాలకు బయలు దేరారు.

కొండమడుగు మెట్టు సర్కిల్ వద్ద కళాశాలకు వెళ్లేందుకు కుడివైపున ఉన్న సర్వీసు రోడ్డుకు స్కూటీని టర్న్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వేగంగా వెళ్తున్న మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ విజయ్ పాల్ రెడ్డికి చెందిన ప్రభుత్వ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో స్కూటీ పై ఉన్న ముగ్గురు రోడ్డుపై ఎగిరిపడ్డారు.స్కూటీ నడుపుతున్న శివ డివైడర్ పై పడి తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

సాయిరాం, భరత్ లకు గాయాలయ్యాయి.భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు