బిగ్‌బాస్‌ అప్‌డేట్స్‌.. ప్రతి శని మందు, వింధు

ప్రపంచం మొత్తం పలు రకాల పేర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న షో బిగ్‌బాస్‌.దాదాపు 12 సంవత్సరాలుగా హిందీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్న బిగ్‌బాస్‌ గత సంవత్సరం నుండి తెలుగులో కూడా ప్రారంభం అయ్యింది.

 Celebrate Parties In Big Boss 2 Telugu House-TeluguStop.com

మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, ప్రస్తుతం ప్రసారం అవుతున్న రెండవ సీజన్‌కు నాని హోస్టింగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే.భారీ స్థాయిలో ఈ షోకు ఆధరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ షో గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది.

ఈ షో నిర్వాహణ ఖర్చులు ఏంటీ, ఈ షోలో బిగ్‌బాస్‌ వాయిస్‌ ఎవరిది ఇలా అనేక రకాలుగా అనుమానాలు ప్రేక్షకులను తొలుస్తూనే ఉన్నాయి.ఇక బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు చేసే అన్ని పనులు సాదారణ ప్రేక్షకులకు కనిపించవు.

కొన్ని పరిధులకు లోబడి మాత్రమే వాటిని చూపిస్తారని తెలుస్తోంది.ఇక బిగ్‌బాస్‌ ఇంట్లో సిగరెట్లు తాగేది చూపిస్తారు.

స్మోకింగ్‌ జోన్‌ స్పెషల్‌గా ఉంది.ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యుల్లో కేవలం తనీష్‌ మాత్రమే స్మోక్‌ చేస్తున్నాడు.

స్మోకింగ్‌ కోసం సిగర్స్‌ బిగ్‌బాస్‌ ప్రతి రోజు పంపిస్తూనే ఉంటాడు.

బిగ్‌బాస్‌ ఇంట్లో స్మోకింగ్‌తో పాటు లిమిటెడ్‌గా మందు కూడా ఉంటుందని తాజాగా ప్రచారం జరుగుతుంది.తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ పూణెకు సమీపంలో జరపడం జరిగింది.దాంతో అక్కడ ఏం జరిగినా కూడా తెలిసేది కాదు.

కాని ప్రస్తుతం బిగ్‌బాస్‌ షో అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.దాంతో ఇక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా తెలిసి పోతుంది.

ప్రతి శనివారం కూడా ఇంటి సభ్యులు కోరుకున్న మందును బిగ్‌బాస్‌ సప్లై చేస్తాడట.ఆడవారికి కూడా మందు విషయంలో పూర్తి స్వేచ్చను నిర్వాహకులు ఇస్తారట.

ఆ విషయాలు మాత్రం బయటకు రానివ్వరు.ఆ సమయంలో మైక్‌లు పక్కకు పడేసి, ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్‌ చేస్తారట.

వారంలో రెండు రోజులు నాని వస్తాడు.నాని శని, ఆది వారాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.కాని ఆ ఎపిసోడ్స్‌ షూట్‌ చేసేది శుక్ర మరియు శనివారాలు.శనివారం సాయంత్రంకు నానితో మీటింగ్‌ అయిపోతుంది.

ఆ తర్వాత ఇంటి సభ్యుల పార్టీ టైం ప్రారంభం అవుతుందని బిగ్‌బాస్‌ టీంలోని కొందరు అనధికారికంగా చెబుతున్నారు.కేవలం తెలుగు బిగ్‌బాస్‌లోనే కాదు, ఈ పద్దతి అన్ని బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా ఉంటుందని వారు చెబుతున్నారు.

మందు తాగినా కూడా అల్లరి చేయకుండా జాగ్రత్తగా ఉండేలా బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఇంటి సభ్యులపై కన్నేసి ఉంచుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube