బాలీవుడ్ బ్యూటి హీరోయిన్ కియరా అద్వానీ( Kiara Advani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కియారా అద్వాని ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది కియారా అద్వానీ.ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా హీరోయిన్లకు పెళ్లి అయితే కట్టుబొట్టు ఇవన్నీ మారుతాయి అన్న విషయం తెలిసిందే.
కొందరు పెళ్లి అయినా కూడా పెళ్లికి ముందు ఎలా ఉండేవారో అలాంటి బట్టలు ధరించడంతో అలాగే ఉంటారు అలాంటి లైఫ్ స్టైల్ మెయింటెయిన్ చేస్తూ ఉంటారు.
కాగా కియారా ఈ ఏడాది హీరో సిద్దార్థ్ మల్హోత్రాను( Sidharth Malhotra ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ భామ పెళ్లి తరువాత కూడా కెరీర్ ను వేగంగా దూసుకుపోయేలా ప్లాన్ చేసుకుంది.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న కియారా ఫ్యాషన్ ఐకాన్ గా మారింది.
ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ తో హొయలు పోయింది.ఇంకా ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేయడం ఆగలేదు.అప్పుడే మరో ఫోటోషూట్ తో చెలరేగిపోయింది.అయితే ఈసారి ఫెమినా మ్యాగజైన్( Femina magazine ) కోసం చిన్నది ఫోజులు ఇచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు.పెళ్లి తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.లేదంటే పెళ్లి మూడు రోజుల ముచ్చటే అవుతుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కొందరు ఫ్యాషన్ ఉండాలి కానీ పెళ్లి తర్వాత కొన్ని పద్ధతులను పాటించడం మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.