బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు.నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళ రాష్ట్రపతికి గౌరవం దక్కదని విమర్శించారు.
మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవని కవిత ఆరోపించారు.ఢిల్లీ నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.
అదేవిధంగా భేటీ బచావో భేటీ పడావో కేవలం నినాదాలకే పరిమితం అయిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.