భారత్ మార్పు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశామని పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కనీసం తాగునీరు, విద్యుత్ లేదన్న కేసీఆర్ మహారాష్ట్రలోనూ ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎందుకీ దుస్థితి అని ప్రశ్నించారు.కేంద్రంలో ప్రభుత్వాలు, ప్రధానులు మారుతున్నారు కానీ ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు లేదని పేర్కొన్నారు.అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం ఎత్తుకున్నామని స్పష్టం చేశారు.
భారత్ పేద దేశం కాదన్న కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన శక్తిగా ఎదగొచ్చని తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ అందిస్తామని తెలిపారు.రెండేళ్లలో మహారాష్ట్రలో అద్భుతాలు చేసి చూపిస్తామని వెల్లడించారు.