గీత గోవిందం సీక్వెల్‌... అల్లు అరవింద్‌ ని మెప్పించడం అంత సులభం కాదు

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు కమర్షియల్‌ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు.

 Allu Aravind Has To Say Ok For The Story Of Geetha Govindam Sequel,allu Aravind-TeluguStop.com

హీరోగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం గడ్డు కాలంను ఎదుర్కొంటున్నారు.గత ఏడాది లైగర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చిన విషయం తెల్సిందే.

Telugu Allu Aravind, Geetha Govindam, Geethagovindam, Khushi, Telugu, Tollywood-

ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వెంటనే ఒక హిట్‌ కోసం విజయ్‌ దేవరకొండ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఖుషి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశ పడ్డాడు.కానీ సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పటి వరకు శివ నిర్వాన ఆ సినిమా ను మళ్లీ మొదలు పెట్టలేదు.షూటింగ్ సగం పూర్తి అవ్వడంతో తదుపరి షెడ్యూల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.
ఇదే సమయంలో విజయ్ దేవరకొండ కు పరశురామ్ గీత గోవిందం సీక్వెల్‌ ఐడియాని చెప్పాడట.వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది.

రష్మిక మందన్నా కూడా వెంటనే గీత గోవిందం సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది.కానీ ఇప్పటి వరకు స్క్రిప్ట్‌ ఫైనల్ అవ్వలేదట.

బన్నీ వాసు నిర్మాణంలో గీత గోవిందం సినిమాను అల్లు అరవింద్ సమర్పించిన విషయం తెల్సిందే.హీరోయిన్‌ గా రష్మిక మందన్నా నటించడం తో సినిమా యొక్క స్థాయి మరింతగా పెరిగింది.

Telugu Allu Aravind, Geetha Govindam, Geethagovindam, Khushi, Telugu, Tollywood-

విజయ్ దేవరకొండ యొక్క స్టైల్‌ కు అంతా ఫిదా అయ్యారు.సీక్వెల్‌ ను కూడా అదే విధంగా రూపొందించాల్సి ఉంది.సీక్వెల్‌ కథ విషయంలో ఆషామాషీగా వ్యవహరిస్తే నిరాశ తప్పదు.అందుకే అల్లు అరవింద్‌ కథ విషయంలో చాలా జాగ్రత్త లు పాటించాలని సూచించాడట.అల్లు అరవింద్‌ ను సీక్వెల్‌ తో మెప్పించడం అంత సులభం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.పరశురామ్‌ ఈ ఏడాది చివరి వరకు మెగా ప్రొడ్యూసర్ ని మెప్పిస్తే గొప్ప విషయమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube