శుక్రవారం రాత్రి లండన్‌లో విడుదల చేసిన 2024 న్యూ ఇయర్ ఆనర్స్( 2024 New Year Honours ) లిస్ట్‌లో 30 ఏళ్లకు పైగా జనరల్ ప్రాక్టీస్ అనుభవం వున్న బ్రిటీష్ సిక్కు సంతతికి చెందిన సీనియర్ వైద్య నిపుణుడు చోటు దక్కించుకున్నారు.న్యూకాజిల్ యూనివర్సిటీలో జనరల్ ప్రాక్టీస్‌లో ఎమెరిటస్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ అమృత్‌పాల్ సింగ్ హుంగిన్( Dr Amritpal Singh Hungin ) సహా దాదాపు 30 మంది భారతీయ సంతతికి చెందిన హెల్త్ కేర్ నిపుణులు , దాతృత్వవేత్తలు, సామాజిక కార్యకర్తలు సమాజానికి వారి నిస్వార్ధ సేవ కోసం సత్కరించబడిన జాబితాలో వైద్య సేవలకు నైట్‌హుడ్ పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రొఫెసర్ పాలి హంగిన్ డర్హామ్ యూనివర్సిటీలో మెడిసిన్ విభాగానికి వ్యవస్థాపక డీన్ , బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ (బీఎంఏ) మాజీ అధ్యక్షుడిగానూ సేవలందించారు.న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలు సాధించిన అసాధారణ విజయాలు, నిస్వార్ధత, కరుణ పట్ల అత్యున్నత నిబద్ధతను ప్రదర్శించిన వారికి గుర్తింపునిస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్( British PM Rishi Sunak ) అన్నారు.
ఈ జాబితాలో స్థానం సంపాదించిన వారు దేశానికి గర్వకారణం కావడంతో పాటు మా అందరికీ స్పూర్తి అని ఆయన పేర్కొన్నారు.
బ్రిటీష్ చక్రవర్తి పేరిట ప్రభుత్వ కేబినెట్ కార్యాలయం ఏటా విడుదల చేసే ఈ జాబితాలో స్టాఫోర్డ్‌షైర్ జీపీ డాక్టర్ చంద్రమోహన్ కన్నెగంటికి( Dr Chandra Mohan Kanneganti ) కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్‌కు (సీబీఈ) ఎంపికయ్యారు.ఆయనతో పాటు డాక్టర్ మాలా రావు (ప్రజారోగ్యం, నేషనల్ హెల్త్ సర్వీస్), బిదేశ్ సర్కార్ (పబ్లిక్ సర్వీస్, డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్)లకు సీబీఈ గౌరవం దక్కింది.
బ్రిటీష్ ఇండియన్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (ఓబీఈ) విభాగంలో బల్దేవ్ ప్రకాష్ భరద్వాజ్, డాక్టర్ దీపాంకర్ దత్తా, మునీర్ పటేల్, డాక్టర్ శృతి పట్టాని, రాజ్విందర్ సింగ్, వినయచంద్ర గుడుగుంట్ల వెంకటేశంలు ఎంపికయ్యారు.బ్రిటన్ మహారాజు కింగ్ ఛార్లెస్ III( King Charles III ) పేరిట ప్రధాన చేసే అవార్డుల కమిటీకి ప్రధాని రిషి సునాక్ నేతృత్వం వహిస్తారు.అవార్డులకు ఎంపికైన వారిని బ్రిటన్‌లోని భారతీయ కమ్యూనిటీ ప్రశంసించింది.