యూకే వీసాకు( UK Visa ) సంబంధించి ఆ దేశ ప్రధాని రిషి సునాక్( UK PM Rishi Sunak ) కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ లండన్ టెక్ వీక్ 2023 ’’( London Tech Week 2023 ) కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.
బ్రిటన్‌ను టెక్ బిజినెస్‌లో అత్యుత్తమ దేశంగా మార్చడంలో సహాయపడటానికి ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం వుందన్నారు.ఇదే సమయంలో యూకే వీసా ప్రక్రియను మెరుగుపరచడం గురించి రిషి సునాక్ మాట్లాడారు.
ప్రపంచంలోని టెక్ క్యాపిటల్స్‌లో ఒకటిగా యూకే తన స్థానాన్ని నిలుపుకోవడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఏఐ, క్వాంటం, సింథటిక్ బయాలజీ, సెమీ కండక్టర్లతో సహా కొత్త సాంకేతికతలలో పెట్టుబడి పెట్టడం ద్వారా యూకే ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి చేయడం తన ప్రాధాన్యతలలో ఒకటన్నారు.
గడిచిన దశాబ్ధ కాలంలో 134 యునికార్న్‌లను సృష్టించామని.ఈ విషయంలో యూఎస్, చైనా తర్వాత యూకే ప్రపంచంలో మూడవ స్థానంలో వుందని రిషి సునాక్ పేర్కొన్నారు.అలాగే ప్రపంచంలో డిజిటల్ అక్షరాస్యత వున్న దేశాల్లో ఒకటిగా వున్నామన్నారు.యూఎస్ కంటే ఎక్కువ శాతం STEM గ్రాడ్యుయేట్లు, ప్రపంచంలోనే టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో 4 యూకేలోనే వున్నాయని రిషి సునాక్ చెప్పారు.
తమ ప్రభుత్వం పెట్టుబడికి అనుకూలమైన పన్ను విధానాన్ని నిర్మిస్తోందన్నారు.తద్వారా పబ్లిక్ రంగంలో ఆర్ అండ్ డీ పెట్టుబడుల స్థాయిలను పెంచుతున్నామన్నారు.
సైన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీపై దృష్టి సారించే కొత్త విభాగాన్ని సృష్టించామని తెలిపారు.ప్రపంచంలోని ప్రముఖ నిపుణులను యూకే తీసుకురావడానికి , ఆవిష్కరణలకు మద్ధతుగా రిస్క్ తీసుకోవడానికి వెనుకాడబోనని రిషి సునాక్ స్పష్టం చేశారు.
ఇకపోతే.బ్రిటన్‌లోకి అక్రమ వలసలను అరికట్టేందుకు గాను ప్రధాని రిషి సునాక్ “Stop the Boats” నినాదాన్ని అందుకున్నారు.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న సాధారణ ఎన్నికల ముందు ఇది ఆయన అభ్యర్ధిత్వానికి కీలకమైనదిగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని రిషి సునాక్, హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్‌లు అక్రమ వలస బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
చిన్న చిన్న పడవల్లో అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశించే వారిని అరెస్ట్ చేసి వారిని తిరిగి స్వదేశానికి లేదంటే మూడో దేశానికో పంపించాలని బిల్లు ప్రతిపాదించింది.అటువంటి వ్యక్తి తర్వాతి కాలంలో యూకేలోకి రాకుండా శాశ్వతంగా నిషేధించబడతాడు.ఫ్రాన్స్ నుంచి చిన్న పడవల ద్వారా యూకేకు అక్రమంగా తరలించేందుకు మానవ అక్రమ రవాణా ముఠాలు ఒక్కొక్కరి నుంచి 3000 పౌండ్లను వసూలు చేస్తున్నాయి.ఇదొక పెద్ద రాకెట్.
స్మగ్లింగ్ గ్యాంగ్‌లు డింగీలను ( చిన్న ప్లాస్టిక్ బోటు) టర్కీలో కొనుగోలు చేస్తాయి.అనంతరం వాటిని జర్మనీకి తరలించి, వాటిని ఫ్రాన్స్‌కు తీసుకెళ్తాయి.
అక్కడి నుంచి అక్రమ వలసదారులను పడవల్లో ఎక్కించి ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా బ్రిటన్‌కు చేరుస్తాయి.అయితే మార్గమధ్యంలోనే పడవలు మునిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.