ముందు మ్యూజిక్ డైరెక్టర్లను గౌరవించడం నేర్చుకో బోయపాటి...

బోయపాటి శ్రీను( Boyapati Srinu ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన తీసిన మాస్ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ఆయన మొదటి సినిమా అయిన భద్ర నుంచి రీసెంట్ గా వచ్చిన స్కంద సినిమా వరకు అన్ని సినిమాలు కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే సినిమాలు కావడమే ఆయన సక్సెస్ కి చాలా వరకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.

 Boyapati Srinu Not Giving Importance To Music Directors,boyapati Srinu ,music Di-TeluguStop.com

ఇక బోయపాటి బాలయ్య బాబుతో( Balakrishna Boyapati Combo ) చేసిన సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో భారీ హిట్లను అందుకున్నాడు.

Telugu Akhanda, Boyapati Srinu, Music Directors, Skanda-Movie

ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో నాలుగో సినిమా కూడా రాబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడి వరకు బానే ఉంది కానీ బోయపాటి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అఖండ సినిమా గురించి మాట్లాడుతూ అఖండ సినిమా( Akhanda Movie ) అనేది తన వల్లే హిట్ అయిందని వేరే వాళ్ళు చేస్తే ఫ్లాప్ అయ్యేదని మాటలు మాట్లాడాడు అయితే నిజంగా చెప్పాలంటే అఖండ సినిమా అంతా పెద్ద హిట్ అవ్వడానికి కారణం తమన్( Thaman ) ఆ సినిమాకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి.ఆయన అంత మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం వల్లే ఆ సినిమాలో చాలా సీన్లు ఎలివేట్ అయ్యాయి ఆ సీన్ల కి ఆ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అంత మంచి ఎలివేషన్ వచ్చిండేది కాదు.

 Boyapati Srinu Not Giving Importance To Music Directors,Boyapati Srinu ,Music Di-TeluguStop.com
Telugu Akhanda, Boyapati Srinu, Music Directors, Skanda-Movie

ఇక రీసెంట్ గా బోయపాటి ఇదే మ్యాటర్ మీద మాట్లాడుతూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్( Background Music ) లేదు ఏం లేదు ఆ సినిమా నా వాళ్ళనే ఆడింది అన్నట్టుగా మాట్లాడాడు కానీ స్కంద సినిమా( Skanda Movie ) మాత్రం అవరేజ్ గా ఆడుతున్నందుకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా లేకపోవడం వల్లే ఆ సినిమా సరిగ్గా ఆడట్లేదు అంటూ ఇన్ డైరెక్ట్ గా తమన్ మీద కామెంట్లు చేశాడు.ఇక అఖండ సినిమా ఆడటానికి కారణం నువ్వు కానీ స్కంద సినిమా ప్లాప్ అవ్వడానికి మాత్రం తమన్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఆ సినిమా సరిగ్గా ఆడటం లేదు అని అన్నాడు.

Telugu Akhanda, Boyapati Srinu, Music Directors, Skanda-Movie

అయితే ఇది చూసిన చాలా మంది ఆ రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్( Music Director ) గా ఉన్నప్పుడు అఖండ సినిమా బాగా ఆడితే అది బోయపాటి వల్లనే సాధ్యమైంది అనడం ఇక ఇంకో సినిమా కాస్త అవరెజ్ గా ఆడితే అది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా ఇవ్వకపోవడం వల్ల సరిగ్గా నడవడం లేదు అని అంటున్నావ్ బోయపాటి ఒక్కసారి మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ ఆయనకి జనాలు భారీ ఎత్తున మెసేజ్ లు,ఫోన్లు కూడా చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube